• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Singer Sunitha Husband: ఆ వర్గం మహిళలపై వీడియోలు.. సింగర్ సునీత భర్తకు వార్నింగ్.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే?

Singer Sunitha Husband: ఆ వర్గం మహిళలపై వీడియోలు.. సింగర్ సునీత భర్తకు వార్నింగ్.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే?

Singer Sunitha Husband: తెలుగు సినీ పరిశ్రమలో సింగర్ సునీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన మధురమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సునీత రెండో వివాహం తర్వాత ఆమె భర్త రామ్ వీరపనేని పేరు ఒక వివాదం కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన సుమారు ఐదేళ్ల క్రితం చోటుచేసుకుంది.

Written ByVishnu Priya
Published: Nov 04, 2026, 04:05 PM IST|Updated: Nov 04, 2026, 04:10 PM IST
joinshare
Singer Sunitha Husband: ఆ వర్గం మహిళలపై వీడియోలు.. సింగర్ సునీత భర్తకు వార్నింగ్.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఢిల్లీ మహానగరాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం.. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ విలవిల..

ఢిల్లీ మహానగరాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం.. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ విలవిల..

2

తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్..!!

3

AP Child Trafficking News: ఏపీలో బాలల అక్రమ రవాణాకు చెక్.. అదృశ్యమైన చిన్నారుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం!

4

Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి!

5

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. తెల్లజుట్టు సమస్యకు సహజ పరిష్కారం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Singer Sunitha Husband: రామ్ వీరపనేని వ్యాపారవేత్తగా, మీడియా రంగంలోనూ గుర్తింపు పొందారు. ఆయనకు సంబంధించిన మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన కొన్ని వీడియోలపై అప్పట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో తమ వర్గానికి చెందిన మహిళలను అవమానకరంగా చూపించారని వారు ఆరోపించారు. 

కావాలనే ఆ సామాజిక వర్గ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ ఆరోపణలు చేస్తూ ఆ కులానికి చెందిన కొందరు వ్యక్తులు అందోళన వ్యక్తం చేశారు..ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీడియోలను వెంటనే తొలగించాలని కొందరు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ విషయంపై తమ నిరసనను వ్యక్తం చేసేందుకు కొందరు వ్యక్తులు రామ్ వీరపనేని కార్యాలయానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

ఆ సమయంలో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అందులో కొందరు వ్యక్తులు రామ్ వీరపనేని, ఆయన యూట్యూబ్ ఛానెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడినట్లు కనిపించింది. తమ వర్గానికి చెందిన మహిళలను కించపరిచే విధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
 
ఈ ఘటనపై అప్పట్లో సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు వీడియోలపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరికొందరు వివాదం ఎలా మొదలైందనే విషయంపై చర్చించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి పరిణామాలపై అప్పట్లో స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రాలేదు.
ఈ వివాదం కారణంగా సింగర్ సునీత పేరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అయితే వివాదం ఆమె పాటలు లేదా సినిమాలకు సంబంధించినది కాదు. ఆమె భర్త రామ్ వీరపనేనికి సంబంధించిన మీడియా కంటెంట్ కారణంగానే ఈ విషయం వార్తల్లోకి వచ్చింది.

ఇక సునీత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయారు. ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఆమె తన కెరీర్‌లో ముందుకు సాగారు. ఎన్నో ఏళ్ల తర్వాత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సునీత రెండో వివాహం కూడా అప్పట్లో తెలుగు సినీ వర్గాల్లో పెద్ద వార్తగా నిలిచింది. వివాహం తర్వాత ఆమె కుటుంబ జీవితం గురించి అభిమానులు ఆసక్తిగా తెలుసుకునేవారు. అదే సమయంలో రామ్ వీరపనేనికి సంబంధించిన ఈ వివాదం వెలుగులోకి రావడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది.
Read More: Radhika Apte: పెద్దవయసు హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్య మూవీపై రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు..

Read More: కొత్త భామలతో కళకళ లాడుతున్న టాలీవుడ్.. బడా ప్రాజెక్ట్స్‌లో యంగ్ బ్యూటీస్.
 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie