SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Srishti Vyakaranam Elimination: బిగ్‌బాస్ హౌస్‌ నుంచి హాట్ బ్యూటీ సృష్టి ఎలిమినేషన్..నాలుగు వారాలకు ఎంత సంపాదించిందంటే?

Srishti Vyakaranam Bigg Boss Remuneration: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నాలుగో వారంలో మోడల్, నటి సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్లతో తక్కువ శాతం ఓట్లు రావడం సహా సుధీర్‌తో గొడవ, ఆ కోపంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఓటింగ్‌ను చాలా డామేజ్ చేశాయి. దీంతో ఆమె ఎలిమినేషన్ తప్పలేదని టాక్ నడుస్తోంది. అయితే ఆమె బిగ్‌బాస్‌లో ఉన్న నాలుగు వారాలతో పాటు అంతకుముందు అగ్నిపరీక్ష షో ద్వారా ఆమె సంపాదన ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Oct 04, 2026, 08:39 PM IST | Updated: Oct 04, 2026, 08:42 PM IST
Join

Srishti Vyakaranam Bigg Boss Remuneration: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, 'అగ్నిపరీక్ష' కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. హౌస్‌లో తనదైన శైలిలో రాణించేందుకు ప్రయత్నించినా.. ప్రేక్షకులలో ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. 

నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియలో సృష్టి వ్యాకరణంతో పాటు దేబ్జానీ, అమన్ తదితరులు డేంజర్ జోన్‌లో నిలిచారు. ప్రారంభం నుంచే ఓటింగ్‌లో వెనుకబడిన సృష్టి.. చివరి వరకు జరిగిన మార్పుల అనంతరం తక్కువ ఓట్లు సాధించడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

హౌస్‌లోని వివాదాలు, నాగార్జున వార్నింగ్
హౌస్‌లో సృష్టి ప్రయాణంలో సుధీర్‌‌తో జరిగిన తీవ్ర వివాదం ప్రధానంగా చర్చకు వచ్చింది. నామినేషన్ల సమయంలో వీరిద్దరి మధ్య మాటామాట పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సృష్టి అత్యంత కోపంతో చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 

ఈ ఘటన వల్ల ఆమె గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కాగా, రెండో వారంలోనే ఆమె గేమ్‌పై మరింత ఫోకస్ పెట్టాలని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సూచించారు.

రెమ్యునరేషన్ ఎంత?
మోడల్ సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ షో కోసం వారానికి సుమారు రూ. 75 వేల పారితోషికం పొందిందని తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగు వారాలు హౌస్‌లో ఉన్నందుకు గాను ఆమెకు రూ. 3 లక్షలు.. అలాగే అంతకుముందు 'అగ్నిపరీక్ష' ద్వారా లభించిన రూ. 50 వేల రెమ్యునరేషన్‌ను కూడా కలిపితే, టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా సృష్టి మొత్తం రూ. 3.50 లక్షల వరకు అర్జించిందని వార్తలు వస్తున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES