Heroine: గుండుతో కనిపించి షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. ఆ లుక్ వెనుక అసలు కారణమిదే!
Heroine: ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న పొలిటికల్ వెబ్ సిరీస్‌లలో ‘మహారాణి’కి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లో జరిగే ఎత్తులు, పైఎత్తులు, అధికార పోరాటాలు, వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలతో రూపొందిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఇందులో రాణి భారతి పాత్రలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటివరకు నాలుగు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు ఐదో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Heroine: తాజాగా ‘మహారాణి సీజన్ 5’కు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో అందరి దృష్టిని ఆకర్షించింది హుమా ఖురేషి కొత్త లుక్. ఆమె పూర్తిగా గుండు చేయించుకున్న రూపంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు రాణి భారతిని ఒక ప్రత్యేకమైన రాజకీయ నాయకురాలిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఈ కొత్త అవతారం వెనుక కారణం ఏమై ఉంటుందా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ మార్పు కేవలం ప్రచారం కోసం చేసిన ప్రయోగం కాదు. కథలోని కీలకమైన సందర్భానికి అనుగుణంగా హుమా ఈ లుక్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. తన కెరీర్‌లో ఇలాంటి సాహసం చేయడం ఇదే మొదటిసారని ఆమె వెల్లడించారు. ఐదో సీజన్‌లో రాణి భారతి పాత్రను మరింత కొత్తగా, లోతుగా చూపించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
మొదటిసారి గుండు చేయించుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత భయం కలిగిందని, అదే సమయంలో కొత్త అనుభూతి కూడా కలిగిందని హుమా చెప్పారు. ఈ మార్పు వల్ల తన పాత్రలోని భావోద్వేగాలను మరింత బాగా అర్థం చేసుకోగలిగానని వివరించారు. ఒక నటిగా తన పరిధిని పెంచుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడిందని పేర్కొన్నారు.
సాధారణమైన పాత్రల కంటే భిన్నమైన లక్షణాలు, ఎన్నో భావోద్వేగాలు ఉన్న క్యారెక్టర్లు చేయడానికే హుమా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. రాణి భారతి పాత్ర కూడా అలాంటిదే. ప్రతి సీజన్‌లోనూ ఈ పాత్రలో కొత్త కోణాలను చూపించే అవకాశం లభిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇలాంటి పాత్రను అందిస్తున్న రచయితలు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
మొదటి సీజన్‌లో సాధారణ గృహిణిగా పరిచయమైన రాణి భారతి, పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో రాజకీయ కుట్రలు, అధికార పోరాటాలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఐదో సీజన్‌లో ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ కొత్త సీజన్ కథ తనను మొదటి నుంచే ఆకట్టుకుందని, ప్రేక్షకులకు ఊహించని మలుపులు ఎదురవుతాయని హుమా ఖురేషి చెబుతున్నారు. ‘మహారాణి సీజన్ 5’ను 2027 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ పొలిటికల్ డ్రామా ఐదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.