• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఆయన విడాకుల వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ విడిపోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన గత వివాహాల గురించి కూడా చర్చ మొదలైంది. ఈ క్రమంలో పవన్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Written ByVishnu Priya
Published: Nov 10, 2026, 03:55 PM IST|Updated: Nov 10, 2026, 03:59 PM IST
joinshare
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

2

మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!

3

ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!

4

పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

5

జపాన్‌లో వింత స్లీపింగ్ కాంపిటీషన్.. 90 నిమిషాలు నిద్రపోతే లక్షల రూపాయల బహుమతి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని. ఆమె విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని కథనాలు చెబుతున్నాయి. పవన్ హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత వీరిద్దరికి పెద్దలు వివాహం చేశారు. 1997లో జరిగిన ఈ పెళ్లి సమయానికి పవన్ వయసు 26 ఏళ్లు కాగా, నందినికి 19 ఏళ్లు.

అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నటి రేణు దేశాయ్‌కు దగ్గరయ్యారు. ఈ పరిణామాలతో నందిని, పవన్ మధ్య దూరం మరింత పెరిగిందని ప్రచారం జరిగింది.

ఈ వ్యవహారం 2007లో కోర్టుకు చేరింది. విడాకులు తీసుకోకుండానే పవన్ మరో వివాహం చేసుకున్నారంటూ నందిని కోర్టును ఆశ్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు పవన్ కూడా నందినితో విడాకులు కోరుతూ న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. చివరకు 2008 ఆగస్టులో వీరిద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. ఈ విడాకుల సమయంలో నందినికి సుమారు రూ.5 కోట్ల భరణం ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

విడాకుల తర్వాత నందిని ఎక్కడున్నారు?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత నందిని పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే విడాకుల తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి అక్కడ ఓ ఎన్నారై వైద్యుడిని రెండో వివాహం చేసుకున్నట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆమె తన పేరును జాహ్నవిగా మార్చుకున్నారని కూడా ప్రచారం ఉంది. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారికంగా స్పష్టత లేదు.

ఇక నందినితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు అన్నాతో విడాకుల వార్తలు తెరపైకి రావడంతో పవన్ గత వివాహాలు, ఆయన మొదటి భార్య నందిని గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అయితే తాజా విడాకుల వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రచారాలను నిజాలుగా భావించకూడదు.

Read More: Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!

 

 

Read More:పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!


 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie