SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Actors Foreign Citizenship: సన్నీలియోన్‌ నుంచి కత్రినా కైఫ్ వరకు..విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా?

Bollywood Actors Foreign Citizenship: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు భారతీయ పౌరసత్వం లేకపోయినా తాజాగా ముంబైలో జరిగిన సీఈసీ నిరసన కార్యక్రమంలో పాల్గొనగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో అతను భారతీయ పౌరుడు కాదని తేలింది. దీంతో అక్టోబరు 28 లోగా దేశం విడిచి వెళ్లాలంటూ ముంబై పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఎంతమందికి భారతీయ పౌరసత్వం లేదనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

Written By Harish Darla
Published: Oct 15, 2026, 05:08 PM IST | Updated: Oct 15, 2026, 05:11 PM IST
Join

Bollywood Actors Foreign Citizenship: భారతీయ సినిమా రంగంలో నటనతో తమదైన ముద్ర వేసిన పలువురు నటీనటులకు మన దేశ పౌరసత్వం లేకపోవడం గమనార్హం. తాజాగా ముంబైలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్యతో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సదరు నటుడికి అసలు భారతీయ  పౌరసత్వమే లేదని తాజా విచారణలో తేలింది. దీంతో అక్టోబరు 28 నాటికి తాను భారతదేశం విడిచి వెళ్లాలంటూ ముంబై పోలీసులు ఆదేశించారు.

అయితే బాలీవుడ్ ‌నటీనటుల్లో భారతీయ పౌరసత్వం లేకుండా మన దేశంలో సంపద ఆర్జిస్తున్న నటీమణులు చాలామందే ఉన్నారు. అయితే వారందరికి ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉండడం విశేషం. బాలీవుడ్ హీరోయిన్లలో సన్నీ లియోనీ, ఆలియా భట్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి వారికి విదేశీ పౌరసత్వం ఉన్నట్లు తేలింది. అయితే అలాంటి బాలీవుడ్ నటీనటుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఆలియా భట్..
'ఆర్ఆర్ఆర్', 'రాజీ', 'గంగూబాయి కతియావాడి', 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' వంటి చిత్రాలతో అలరించి బాలీవుడ్ నటి ఆలియా భట్ భారతీయ పౌరురాలు కాకపోవడం గమనార్హం. తన తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ దర్శకుడైనా.. ఆలియా భట్ మాత్రం బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. అయినా ఆమె హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

2) కత్రినా కైఫ్..
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఒక బ్రిటిష్ పౌరురాలు. ఆమె బాలీవుడ్‌లో విజయవంతమైన స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలలో 'నమస్తే లండన్', 'జిందగీ నా మిలేగీ దోబారా', 'ఏక్ థా టైగర్', 'టైగర్ 3' ఉన్నాయి.

3) సన్నీ  లియోన్..
కెనడా, అమెరికా పౌరసత్వం కలిగిన హీరోయిన్ సన్నీ లియోన్.. 'జిస్మ్ 2' చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.  ఆ తర్వాత 'రాగిణి MMS 2', 'ఏక్ పహేలీ లీలా' వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.

4) ఇమ్రాన్ ఖాన్..
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ అనేక హిందీ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. 
అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు సమాచారం ఉన్న ఇమ్రాన్ ఖాన్, 'జానే తూ... యా జానే నా' చిత్రంతో పాపులర్ అయ్యారు. 'ఢిల్లీ బెల్లీ', 'ఐ హేట్ లవ్ స్టోరీస్', 'మేరే బ్రదర్ కి దుల్హన్' వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సీఈసీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొని అరెస్ట్ అయ్యారు. దీంతో విదేశీ పౌరసత్వాన్ని కలిగిన ఇమ్రాన్ ఖాన్‌ను తన దేశానికి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

5) నర్గీస్ ఫఖ్రీ..
అమెరికన్ నటి నర్గీస్ ఫఖ్రీ, రణబీర్ కపూర్ సరసన 'రాక్‌స్టార్' చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆమె నటించిన ఇతర చిత్రాలలో 'మద్రాస్ కేఫ్', 'మై తేరా హీరో', 'హౌస్‌ఫుల్ 3' ప్రేక్షకులను అలరించారు.

6) నోరా ఫతేహి..
కెనడా పౌరురాలైన నోరా ఫతేహి, భారతీయ చిత్రాలలో తన నృత్య ప్రదర్శనలు, నటనకు విస్తృతంగా గుర్తింపు పొందారు. ఆమె 'సత్యమేవ జయతే' చిత్రంలోని 'దిల్బర్' పాటతో ప్రజాదరణ పొందారు. హిందీ చిత్రసీమలో అనేక సినిమాల్లో ఆమె తెరపై కనువిందు చేశారు.

7) జాక్వెలిన్ ఫెర్నాండేజ్..
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంక పౌరసత్వం కలిగి ఉన్నారు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాలలో 'మర్డర్ 2', 'కిక్', 'హౌస్‌ఫుల్ 2', 'జుడ్వా 2' ఉన్నాయి.

8) ఇలియానా డీక్రూజ్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియాన్ డీక్రూజ్‌కు పోర్చుగీస్ పౌరసత్వం కలిగి ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయకముందే ఆమె తెలుగులో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'పోకిరి' సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకొని కెరీర్‌లో ఇక వెనక్కి తిరిగి చూసుకునే పనిరాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానా 'బర్ఫీ!', 'మై తేరా హీరో', 'రుస్తమ్', 'రైడ్' వంటి చిత్రాలతో అలరించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES