• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘సీన్’ మూవీ రివ్యూ.. సూర్య ఖాతాలో హాట్రిక్ పడినట్టేనా..!!

‘సీన్’ మూవీ రివ్యూ.. సూర్య ఖాతాలో హాట్రిక్ పడినట్టేనా..!!

Scene Movie Review: గత కొన్నేళ్లుగా థియేట్రికల్ హిట్ లేని సూర్య ఈ యేడాది ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే ఫ్యామిలీ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సారి మలయాళ దర్శకుడు జితూ మాధవన్ డైరెక్షన్‌లో ‘సీన్’ సినిమా చేశాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 01:22 PM IST|Updated: Nov 06, 2026, 02:01 PM IST
joinshare
‘సీన్’ మూవీ రివ్యూ.. సూర్య ఖాతాలో హాట్రిక్ పడినట్టేనా..!!
Image Credit: Scene Movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

2

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

3

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

4

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

5

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Suriya Scene Review: సూర్య ప్రస్తుతం రూట్ మార్చాడు. రెగ్యులర్ మాస్ సినిమాలను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఓకే చేస్తున్నాడు. ఈ కోవలో జీతూ మాధవన్ డైరెక్షన్‌లో ‘సీన్’ సినిమా చేశాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.  


కథ విషయానికొస్తే..

ప్రేమరాజ్ (సూర్య) పోలీస్ అధికారి. ఎలాంటి  క్రైమ్ కేసులైనా అతనికి అప్పగిస్తే   సాల్వ్ చేస్తుంటాడు. ఈ కోవలో అతనికో మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ మర్డర్‌ను గతంలో అతను పట్టుకున్న మరో మర్డర్ చేసిన హంతకుడిని పోలిక ఉండేలా ఈ సైకో మర్డర్ చేస్తాడు.  దీంతో ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు ప్రేమ్ రాజ్. ఈ కోవలో అతను తన దగ్గర పనిచేయడానికి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఓ మహిళ మాయ (నజ్రియా నజీమ్)ను అపాయింట్ చేసుకుంటాడు. అసలు మాయను ప్రేమ్ రాజ్ ఎందుకు అపాయింట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కేసుకు  మాయకు ఉన్న సంబంధం ఏమిటి.. ? చివరకు ఆ సైకో కిల్లర్‌ను మాయ సాయంతో  ప్రేమ రాజ్ ఎలా పట్టుకోగలిగాడనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు జితూ మాధవన్ ఈ కథను గతంలో వచ్చిన కొన్ని కథలను మిక్స్ చేసి మిక్సీలో వేసి  రుబ్బాడు.గతంలో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథలు తెలుగు సహా ఇతర భాషల్లో వచ్చాయి. ఇందులో హీరోకు కళ్లు కనబడవు. దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. కానీ పై అధికారి అతని రాజీనామాను ఆమోదించడు.  ఓ పాత నేరస్తుడిని ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో హీరోకు కళ్లు లేవనే విషయం ప్రేక్షకులకు తెలియజేస్తాడు దర్శకుడు . ఉద్యోగంలో అతని రూఢ్‌ బిహేవియర్ ఎందుకు చేస్తున్నాడనే విషయాన్ని హీరోతో తర్వాత చెప్పిస్తాడు. ఇందులో దర్శకుడు హీరోను షార్ట్‌ టీ షర్ట్‌తోనే చూపించే ప్రయత్నం చేశాడు.  ఈ చిత్రంలో లాజిక్ లేని సీన్స్ కోకొల్లలు. వాటిని పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులు థ్రిల్‌కు గురవుతారు.  కానీ దర్శకుడు తన స్క్రీన్‌ప్లే‌తో సినిమాను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో క్యారెక్టర్‌.. హీరోయిన్‌ను తన కళ్లుగా అపాయింట్ చేసుకోవడం సీన్స్ కొత్తగా ఫ్రెష్‌గా ఉన్నాయి. అయితే టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందిన కాలంలో హీరోకు కళ్ల ప్రాబ్లెమ్ లాంటివి వుంటే వాటిని సాల్వ్ చేసే సర్జన్లు ఎంతో మంది ఉన్నారు. మరి హీరో కళ్లకు సర్జరీ ఎందుకు చేయించుకోలేదనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇందులో హీరోకు కళ్లు కనబడవు. హీరోయిన్‌కు ఫిట్స్ లాంటివి ఉంటుంది. తండ్రి షార్ట్ టర్న్ మెమరీ లాస్ ఉన్న ఫోరెన్సిక్ ఎక్స్‌పెర్ట్. హీరో తల్లి తాగుబోతు సైకాలజిస్ట్. తండ్రికి ఎందుకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎందుకు వచ్చింది. సైకాలిస్ట్ అయిన తల్లి ఎందుకు సారా కాచుకుంటు తిరుగుతుందనే సీన్స్‌కు లాజిక్‌కు ఉండదు. ఇక హీరోయన్‌ను ఊహించుకునే క్రమంలో  జ్యోతిక ను చూపించే సీన్ ఆకట్టుకుంది.  

సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో  హీరో ఎత్తులకు విలన్ పై ఎత్తులు వేయడం.. చివరకు గుడ్డివాడైన హీరోను చంపడానికి విలన్ హీరో ఇంటికి రావడం చివరకు హీరో సైకో విలన్‌‌ను చంపడం ఎన్నో సినిమాల్లో చూసిందే. మొత్తంగా ‘సీన్’ సినిమా ఓ కామన్ ఆడియన్స్ కు లాజిక్‌కు అందరి మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది.క్రైమ్ థ్రిల్లర్ మూవీలోనే కామెడీ పండించే ప్రయత్నం చేయడం విశేషం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ సినిమా దీపావళికి వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. తెలుగులో మాత్రం ఏ మేరకు రాబడుతుందో చూడాలి. 


నటీనటుల విషయానికొస్తే..

సూర్య రెగ్యులర్‌గా నాలుగు ఫైట్లు.. మూడు డ్యూయట్లు అన్నట్టు కాకుండా కథానుగుణంగా ఒదిగిపోయే సినిమాలు చేస్తున్నాడు. సీన్‌లో ఒక్క డ్యూయట్ సాంగ్ లేవు. ఇలాంటి కథలను ఓకే చేయడం అతని గట్స్‌ ఏంటో చెబుతుంది. సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. కళ్లులేని వాడైనా.. కళ్లు ఉన్నట్టుగా మేనేజ్ చేసే సీన్స్ బాగున్నాయి. నజ్రియా నజిమ్ తన పాత్రలో ఒదిగిపోయింది. సైకో కిల్లర్‌గా ప్రేమలు ఫేమ్ నస్లీన్ సైకో కిల్లర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది.  ప్రేమలు సినిమాలో లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న ఇతను ఇందులో సైకో విలన్‌గా చెలరేగిపోయి నటించాడు. అతనికి సాయపడే ఆటో డ్రైవర్ పాత్ర కూడా సినిమాకు పెద్ద హెల్ప్ అయింది.  స్టీఫెన్‌గా లాల్.. టొవినో థామస్ కాసేపు కనబడ్డ తన ఇంపాక్ట్ చూపించాడు. ఆనంద్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

పంచ్ లైన్.. ‘సీన్’ లాజిక్‌కు అందని మర్డర్ సస్పెన్స్ క్రైమ్ డ్రామా

రేటింగ్: 2.5/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie