ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో '3 2 1'.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్..
3 2 1 Trailer Talk: తెలుగులో ఎప్పటి కపుడు దర్శక, నిర్మాతలు సరికొత్త తెలుగు కథలతో వస్తున్నారు. ఆయా కథలతో మెప్పిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం ‘ 3 2 1 ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తే మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది.
3 2 1 Release Date: ఎంటర్టైన్మెంట్తో పాటు ఆలోచనలను రేకెత్తించే సినిమాలు ఆడియన్స్ మదిలో కలకాలం నిలిచిపోతాయి. ఈ రూట్లోనే కోవలోనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం '3 2 1' (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రాన్ని బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. గతంలో తీసిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్నారు చిలుముల శాంతికుమార్.
రీసెంట్గా విడుదలైన నాని చిత్రం 'పారడైజ్'లో జూనియర్ సమ్మక్కగా నటించి మెప్పించిన లావణ్య ఇందులో హీరోయిన్గా నటించింది. పలు వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ హీరోగా యాక్ట్ చేశాడు. వీరితో పాటు వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
పెళ్ళికి లవ్ మ్యారేజ్ మంచిదా లేక అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అనే సమకాలీన అంశం చుట్టూ తిరిగే ఈ స్టోరీతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. రీసెంట్గా విడుదలైన 'నను తాకిన' పాటతో పాటు ట్రైలర్కు విశేష స్పందన లభించింది. అంతేకాదు మిలియన్ వ్యూస్ రావడం వివేషం. ఈ చిత్రానికి జాయ్ కాల్విన్ సంగీతం అందించారు. మౌనశ్రీ మల్లిక్ గీత రచన చేశారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ అందించారు. శివ సర్వాణి ఎడిటింగ్ నిర్వహించారు. నానిబాబు కో-డైరెక్టర్గా, వివారెడ్డి టైటిల్ పోస్టర్ల బాధ్యతలను నిర్వహించారు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న తరుణంలో, ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.