• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తరుణ్ భాస్కర్ పెళ్లిపై హింట్ ఇచ్చిన తల్లి .. ఈషా రెబ్బపై ఎమోషనల్ ..

తరుణ్ భాస్కర్ పెళ్లిపై హింట్ ఇచ్చిన తల్లి .. ఈషా రెబ్బపై ఎమోషనల్ ..

Tharun Bhascker Eesha Rebba Marriage: టాలీవుడ్‌ నటీనటులు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కన్నాంబ కాలం నుంచి ఉన్నదే. అంతేకాదు ఎంతో దర్శకులు, హీరోయిన్స్‌ను పెళ్లి బంధంతో ఒకటైన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ కోవలో దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్, ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బాతో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త గత కొన్ని రోజులుగా ప్రచారం జరగుతుంది. తాజాగా ఈ విషయమై తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ తరుణ్, ఈషా రెబ్బ పెళ్లిపై ఓపెన్ అయింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 19, 2026, 13:01 IST|Updated: Nov 19, 2026, 13:03 IST
joinshare
తరుణ్ భాస్కర్  పెళ్లిపై హింట్ ఇచ్చిన తల్లి .. ఈషా రెబ్బపై  ఎమోషనల్ ..
Image Credit: Tharun Eesha Rebba (Source/ZEE News Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tharun Bhascker Marriage News:ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో  ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ కమ్ యాక్టర్  తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బా మధ్య ఏదో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి బంధంపై తరుణ్ భాస్కర్ తల్లి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో  తెగ వైరల్ అవుతున్నాయి. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

మరోవైపు ఈషా రెబ్బా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్.వీరిద్దరూ కలిసి గతంలో 'ఓం శాంతి శాంతిః' సినిమాలో జోడిగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందనే  వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అంతేకాదు గత కొన్నిరోజులుగా ఎయిర్‌పోర్ట్ సహా పలు ప్రాంతాల్లో వీరు తరుచుగా జంటగా దర్శనమిస్తున్నారు.

ఈఎన్ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గీతా భాస్కర్ ఎమోషనల్..

అయితే తాజాగా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తరుణ్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
తన కొడుకు గత రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆమె చెప్పారు. కోర్టు కేసులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమస్యలతో తరుణ్ చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడని గుర్తుచేసుకున్నారు.

అలాంటి సమయంలో ఈషా రెబ్బా తన కొడుకుకు అండగా నిలిచిందని ఆమె వెల్లడించారు.కొన్నిసార్లు తరుణ్ అర్ధరాత్రి రెండు గంటలకు, నాలుగు గంటలకు ఇంటికి వచ్చినా.. అతడిని చూసుకోవడంలో ఈషా ఎంతో శ్రద్ధ చూపించిందని చెప్పి.. వీరిద్దరు డేటింగ్ చేస్తోన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.

ఈషా తన కుమారుడి సోలో మేట్..

అంతేకాదు.. తన కొడుకుకు ఒక మంచి స్నేహితురాలిగా, జీవితంలో తోడుగా నిలిచే వ్యక్తిగా ఈషా మారిందని భావోద్వేగంగా మాట్లాడారు. తన వయసు పెరుగుతోందని, తన తర్వాత కొడుకుకు తోడుగా ఎవరు ఉంటారోనని గతంలో ఆందోళన చెందేదాన్నని.. ఇప్పుడు ఈషా రూపంలో మంచి తోడు దొరకడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈషాను తన కొడుకు సోల్‌మేట్‌గా అభివర్ణిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆసక్తికరమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. తరుణ్, ఈషా ఇద్దరూ తమ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి పెళ్లి త్వరలోనే అంటూ వస్తున్న వార్తలను ఇప్పుడే నిజమని చెప్పలేం.మొత్తానికి ఒక తల్లి తన కొడుకు జీవితంలో మరో వ్యక్తి ఇచ్చిన మద్దతును ఇంత ప్రేమగా చెప్పడం ఈ కథలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. మరి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తమ బంధంపై ఎప్పుడు స్పందిస్తారు? త్వరలో పెళ్లి వార్త చెబుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News