The Paradise Ticket Sales: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' రికార్డుల ప్రభంజనం..విడుదలకు ముందే రూ.60 కోట్ల వసూళ్లు!
The Paradise Ticket Sales Record: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం 'ది పారడైజ్' మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో 1.1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ సేల్స్ సాధించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు బుకింగ్స్ రూ. 60 కోట్ల మార్కును చేరుకున్నాయి.
The Paradise Ticket Sales Record: గతంలో 'దసరా' సినిమాతో విజయాన్ని అందించిన నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో ఇప్పుడు మరో కొత్త చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 'ది పారడైజ్' టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా ప్రీ-రిలీజ్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైగా ప్రీమియర్ సేల్ సాధించింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తొలుత రూ. 45 కోట్ల నుండి రూ. 60 కోట్ల వరకు వసూళ్లు నమోదయ్యాయి. ఈ మైలురాయితో మహేష్ బాబు 'గుంటూరు కారం', రామ్ చరణ్ 'పెద్ది' వంటి సినిమాల ప్రీ-రిలీజ్ సేల్స్ రికార్డులను 'ది పారడైజ్' అధిగమించింది.
సినిమాపై ఉన్న క్రేజ్‌కు ఆన్‌లైన్ టికెట్ విక్రయాలు స్పష్టమైన నిదర్శనంగా నిలిచాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం అరగంటలోనే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చిత్ర ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బెంగళూరు, చెన్నై, కొచ్చి, ముంబై వంటి ప్రధాన నగరాల్లో పర్యటించింది.
హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగే ప్రత్యేక ప్రీమియర్ షోకు నానితో పాటు చిత్ర యూనిట్ హాజరై అభిమానులతో కలిసి సినిమాను తిలకించనున్నారని సమాచారం. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీసు విభాగం నుంచి అవసరమైన అనుమతులు పొంది, భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశారు.
'ది పారడైజ్' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన స్వరాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఆకట్టుకున్న 'ఏష నాగుల' పాటతో పాటు, ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసిన 'సమ్మక్క' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథాంశం విషయానికి వస్తే, ఇందులో కంప్లీట్ మాఫియా యాక్షన్ అంశాలతో పాటు, తల్లి, కొడుకు మధ్య సాగే గాఢమైన సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ విభిన్నమైన కథాంశంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్-ఇండియా స్థాయిలో నాని అభిమానులు ఈ చిత్రం విజయంపై ధీమాతో ఉన్నారు.
Also Read: Radhika Apte Bold Comments: 5 సినిమాల్లో నగ్నంగా నటించిన బాలయ్య హీరోయిన్..దర్శకనిర్మాతలపై ఫైర్..ఎవరో ఆ బ్యూటీ!
Also Read: Pawan Kalyan Food Diet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తినేది ఇదే..55 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా, స్లిమ్‌గా