Feel Good Song: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి దృష్టిలో పడడ్డ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఫీల్ గుడ్’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై దయానంద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుచిత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుచిత్, అదితి త్రిపాఠి జోడిగా యాక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలై ‘మమ్మా మియా’ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యం ఏంటో తెలియజేస్తుంది. యూత్‌ను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
‘వైబ్’, ‘సింక్’, ‘ట్రెండ్’, ‘హైప్’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతుంది. లవ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను డిజైన్ చేశారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి సత్యనారాయణ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ సాంగ్ ఇప్పటి యూత్ అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా ఉంది. మ్యూజిక్ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.
ఈ చిత్రంలో సుచిత్, అదితి త్రిపాఠితో పాటు రవూరి ప్రియాంక, లిఖిత్, సైఫాని, దివ్య మోహన్ రణధీర్ వాసుదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్నివిడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట రిలీజ్ తర్వాత ‘ఫీల్ గుడ్’ చిత్రంపై ప్రేక్షకులు ఈ సినిమా చూడాలనే అభిలాష వ్యక్తం అవుతోంద. అంతేకాదు యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.