SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలుగు తెరపై ‘కొరివి’ దెయ్యం కథ.. టైటిల్ పోస్టర్‌తో సినిమాపై పెరిగిన అంచనాలు..

Korivi Title Announcement: తెలుగు తెరపై కామెడీ, యాక్షన్, హార్రర్ థ్రిల్లర్ చిత్రాలకు ఎపుడు ఆదరణ ఉంటుంది. ఈ కోవలో తెలుగు తెరపై రాబోతున్న మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కొరివి’. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 11:31 AM IST | Updated: Nov 01, 2026, 11:38 AM IST
Image Credit: Korivi Movie Review (X/Source)
Join

Korivi movie Poster: ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో  ప్రేక్షకులను మెప్పించి దర్శకుడు శ్రీధర్ గాదె. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రాన్ని  శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై  ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో "హైవే" వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి ఈ చిత్రాన్నిఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు.

ఈ బ్యానర్ నుంచి వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్నాడు.  నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం "కొరివి" సినిమాకు సంబంధించిన షూటింగ్  శరవేగంగా జరుపుకుంటోంది.

శనివారం దర్శకుడు శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి "కొరివి" అనే టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు సామాజిక్ మాధ్యమాల్లో మంచి రెస్సాన్స్ వస్తోంది. కాలుతున్న పుర్రతో ఉన్న పోస్టర్‌ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది. హార్రర్ థ్రిల్లర్ అంశాలతో రాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని చెబుతున్నారు.  మొత్తంగా  టైటిల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మాయా నది ప్రాంతం లో ఉన్న నిధికి కాపలా కాసే  ఓ కొరివి ఆ దెయ్యం కథ ఇది.

ఈ కొరివి..బిగ్ స్క్రీన్ మీద ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్‌ పీరియన్స్ ఇవ్వడం పక్కా అని చెబుతున్నారు. ఈ టైటిల్ గ్లింప్స్ లో ఇంట్రెస్టింగ్ మేకింగ్ విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. టైటిల్ అనౌన్స్ మెంట్, ఈ గ్లింప్స్ తో "కొరివి" మూవీ అంచనాలు పెరిగాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూనిక్ హారర్ మూవీని సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా   తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES