Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..
Giribabu demise news: టాలీవుడ్ నటుడు, కామెడియన్ గిరిబాబు కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tollywood Senior Actor giribabu passed away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నిరోజుల నుంచి నటుడు గిరిబాబు (80) అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొండాపూర్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
గిరిబాబు ఇక లేరనే విషాదం బైటకు రావడంతో.. ఆయన అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు, నటీ, నటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో చిన్నతనంలోనే మద్రాస్ కు వెళ్లి అవకాశాల కోసం ఎంతో కష్డపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గిరిబాబు.. హీరోగాను, విలన్ గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి ఫాలోవింగ్ సంపాదించుకున్నారు. గిరిబాబు 1973 లో విడుదలైన జగమే మాయ సినిమాతో తెరంగెట్రం చేశారు.
ఆ తర్వాత 1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా చేసి ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ప్రస్థానం కొనసాగింది.గిరిబాబు సతీమణి శ్రీదేవీ 2016 లో మూత్రపిండాల వ్యాధితో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. రఘుబాబు, బోసుబాబు. గిరిబాబు 2023 లో చివరన అన్నీ మంచి శకునములే మూవీలో నటించారు.