SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హీరోలందరు టెర్రరిస్టులే.. ప్రముఖ రచయత ఘాటు కామెంట్స్..

Tollywood Top Directors Terrorists: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోల మీద రచయత కమ్ దర్శకుడు కోన వెంకట్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వందల కోట్లతో సినిమాలు తీసే దర్శకులకు ఏం తీస్తున్నామో క్లారిటీ ఉండదా..? వాళ్లను క్రిమినల్స్ అనడం ఎంతవరకు కరెక్ట్..? ఫామ్ కోల్పోయి చాలా కాలంగా సైలెంట్ అయిపోయిన కోన.. అటెన్షన్ కోసమే ఈ కామెంట్స్ చేశారా..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 07:30 AM IST | Updated: Oct 12, 2026, 07:31 AM IST
Image Credit: Kona Venkat Sensation commets (AI Image/Source)
Join

Kona Venkat Comments: కోన వెంకట్ టాలీవుడ్ టాప్ దర్శకులను, హీరోలను పట్టుకొని టెర్రరిస్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  అసలు ప్లానింగ్ లేని ఇలాంటి దర్శకులను  ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడంతో పాటు వాళ్లను క్రిమినల్స్‌గా చూడాలని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. స్టార్ హీరోలు కూడా ప్యాన్ ఇండియా మోజులో పడకుండా, ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.

కోన వెంకట్ కామెంట్స్ పై దుమారం..
కోన వెంటకే చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ నుంచి, హీరోల ఫ్యాన్స్ నుంచి కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. నిజంగా ఆయనకు అంత తోపు అయితే  గతంలోలా ఇప్పుడు కూడా ఆ స్టార్ హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లను మెప్పించే స్టోరీలు రాయవచ్చుగా అనే కామెంట్స్ చేస్తున్నారు.  మార్కెట్ పెరిగిన తర్వాత ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి కన్ఫ్యూజింగ్ కామెడీ కథల చుట్టూ హీరోలు తిరగలేరనే లాజిక్ కోన మిస్ అయ్యారని ఫ్యాన్స్ ఆయనకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

కోనకు బాగానే ఇచ్చిపడేసిన అభిమానులు.. 

డైరెక్టర్స్‌పై ఇంతలా విరుచుపడుతున్న కోన వెంకట్.. పక్కా ప్లానింగ్‌తో ఆయన నిర్మించిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు. టాప్ డైరెక్టర్స్ ను  క్రిమినల్స్ అంటూ అంత పెద్ద పదం వాడటం కోన వెంకట్ నోరు అదుపులో లేదనే విషయం స్పష్టమైంది.  అటెన్షన్ గ్రాబింగ్ కోసమే ఆయన కావాలని ఈ ఇష్యూను క్రియేట్ చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES