SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

Apollo Hospitals New Post Upasana Kamineni Konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన భార్యకు మరో కొత్త బాధ్యత స్వీకరించింది. భారతదేశ వ్యాప్తంగా ₹8,600 కోట్ల విస్తరణకు అపోలో హాస్పిటల్స్ ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్ – ప్రాజెక్ట్స్‌గా నియమితులయ్యారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 12:59 PM IST | Updated: Sep 24, 2026, 01:05 PM IST
Image Credit: Upasana Apollo projects directors
Join

Apollo Project Director Upasana: అపోలో హాస్పిటల్‌కు దేశ వ్యాప్తంగా  పెరుగుతున్న నెట్‌వర్క్‌లో భాగంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు వైద్య సంరక్షణను సులభతరం చేయడం సహా  రోగులకు నాణ్యమైన చికిత్సలను అందిస్తున్నారు.

ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్ – ప్రాజెక్ట్స్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె ముందు పలు సవాళ్లు ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల ప్రణాళిక  అమలు కోసం అపోలో నాయకత్వం, క్లినికల్ బృందాలతో పాటు కలిసి  ఆమె పనిచేయనున్నారు.  

అపోల్ హాస్పిటల్స్‌లో కొత్త సౌకర్యాల కల్పన.. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల విస్తరణ, దాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు  రోగుల కోసం కేటాయించిన ప్రదేశాలలో స్థిరమైన డిజైన్ ప్రమాణాలను పాటించడం ఉపాసన ముందున్న ప్రాధాన్యతలలో ఒకటిగా ఉన్నాయి.  ప్రాజెక్ట్ బృందాలతో కలిసి పనిచేస్తూ, ఆమె స్పష్టమైన సూచనలు,  మార్గసూచకాలు, సులభమైన నావిగేషన్, సమర్థవంతమైన క్లినికల్ ప్రదేశాలు, రోగులకు, వారి కుటుంబాలకు మరింత సౌకర్యవంతమైన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టనున్నారు.

అపోలో ప్రస్తుత విస్తరణ ప్రణాళిక అంచనా ప్రకారం, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు ₹8600 కోట్లు. ఇందులో ఇప్పటికే ఉన్న సౌకర్యాల విస్తరణ..  జాబితా చేయబడిన బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణ ప్రాజెక్టుల కోసం సుమారు ₹1,565 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో, ఇప్పటికే స్థిరపడిన మార్కెట్లలో అపోల్ హాస్పిటల్స్  సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, అలాగే అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలలో కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఓ ప్రణాళిక ప్రకారం, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సిఆర్, చెన్నై, ముంబై, బెంగళూరులతో పాటు లక్నో, వారణాసి, ఇండోర్, గౌహతి, రాంచీ వంటి ఇతర ప్రాంతాలలో కూడా  ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లనున్నారు.  


=ఆధునిక వైద్య సంరక్షణను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం.  సులభంగా ఉపయోగించుకునేలా చేయడం. ప్రతి ప్రాంతంలో, ఒక ఆసుపత్రి రోగులకు కేవలం ఒకే విజిట్‌తో  సరిపెట్టకుండా, రోగులు బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. అదే సమయంలో, వైద్యులు, నర్సులు, ఇతర నైపుణ్యం గల సిబ్బందికి వారిపై ఆధారపడిన కుటుంబాలకు అవకాశాలను క్రియేట్ చేయనుంది.  అపోలో, ఆసుపత్రి సంరక్షణను నివారణ.  ముందస్తు రోగ నిర్ధారణత వంటి పరీక్షలు చేయనున్నారు. వాటిని డేటాతో అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఎక్కువ మంది ప్రజలు తమ ఆరోగ్యంపై పూర్తి నియంత్రణ సాధించడానికి దోహదపడుతుంది. అందుబాటులో ఉండే, సరసమైన వైద్య సంరక్షణను అత్యుత్తమ వైద్య నైపుణ్యంతో జతచేయడం దీని లక్ష్యం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోగులకు భారతదేశాన్ని ఒక విశ్వసనీయ గమ్యస్థానంగా మార్చలనేదే తమ ఉద్దేశ్యం అన్నారు.

ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలనే నమ్మకంతో మా తాతగారు, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలోను నిర్మించారు. మేము నిర్మించే ఆసుపత్రులలో మేము మెరుగుపరిచే సౌకర్యాలలో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న పెద్ద బాధ్యత అన్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES