• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Actress: ఎఐ కంపెనీను రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్న బాలకృష్ణ నటి..!

Actress: ఎఐ కంపెనీను రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్న బాలకృష్ణ నటి..!

Actress: బాలీవుడ్ నటి ఉర్వశి రౌటేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో కొత్త వివాదం మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థపై ఉర్వశి టీమ్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు ఆమె టీమ్ పేర్కొంది.

Written ByVishnu Priya
Published: Sep 30, 2026, 03:28 PM IST|Updated: Sep 30, 2026, 03:34 PM IST
joinshare
Actress: ఎఐ కంపెనీను రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్న బాలకృష్ణ నటి..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress: ఉర్వశి రౌటేలా బాలకృష్ణ డాకు మహారాజు సినిమా ద్వారా మనందరికీ సుపరిచితురాలు.  ఈ హీరోయిన్ టీమ్ మంగళవారం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా ఉర్వశి పేరు, చిత్రాలు, వీడియోలను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఆమె గుర్తింపును ఉపయోగించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది.

“మీ AI కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోండి. కానీ అనుమతి లేకుండా ఉర్వశి పేరును మీ వ్యాపారంలో ఉపయోగించవద్దు” అనే సందేశాన్ని ఆమె టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నష్టపరిహారం మొత్తాన్ని అంచనా వేస్తున్నామని, అది రూ.7,000 కోట్ల వరకు ఉండవచ్చని పేర్కొంది.

AI సంస్థ స్పందన

ఈ ఆరోపణలపై బాలీవుడ్ AI, హాలీవుడ్ AI సంస్థల వ్యవస్థాపకుడు, సీఈఓ షీరాజ్ హసన్ కూడా స్పందించారు. ఉర్వశి టీమ్ చేస్తున్న రూ.7,000 కోట్ల క్లెయిమ్‌ను ఆయన తప్పుబట్టినట్లు సమాచారం. ఇటీవల ఉర్వశి రౌటేలాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రశ్నించారు. AI కారణంగా బాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడే సమయంలో ఉర్వశి తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే ఆమె సమాధానంపై AI సంస్థ ఘాటుగా స్పందించింది.

AI సంస్థ భవిష్యత్తులో సినిమాలు, డిజిటల్ కంటెంట్, వర్చువల్ నటులు, వర్టికల్ డ్రామాలు వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. AI ఆధారంగా వయసు పెరగని డిజిటల్ స్టార్లు, అనేక భాషల్లో పనిచేసే పాత్రలు భవిష్యత్తులో వినోద రంగంలో భాగమవుతాయని తెలిపింది.

ఇటీవల సెలబ్రిటీల పేరు, ఫొటోలు, గొంతు, డిజిటల్ రూపాలను AI ద్వారా అనుమతి లేకుండా ఉపయోగించడం గురించి చర్చ పెరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ పోలికలను, గొంతులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో కూడా సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన పలు కేసులు కోర్టుల వరకు వెళ్లాయి. AI, డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్ పెరుగుతున్న సమయంలో ఈ ఉర్వశి రౌటేలా వివాదం మరోసారి సెలబ్రిటీ హక్కులపై చర్చకు దారితీసింది.

Read More: Movie News: మంచు తెరల నడుమ గుండెను తాకే రాగం.. మ్యూజిక్ లవర్స్‌కు మెలోడీ ట్రీట్..!

 

Read More: Junior NTR: కుటుంబం కాదు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood