SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘వారణాసి’ షూటింగ్ షై బిగ్ అప్‌డేట్..! అనుకున్న సమయానికి వస్తుందా.. !!

Varanasi Shooting Update: వారణాసి షూటింగ్ అప్‌డేట్ ఏమిటి..? ఎంతవరకు వచ్చిందనేది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అసలు షూట్ ఎంత పూర్తైంది ? ఇంకా షూటింగ్ ఎంత వరకు బ్యాలెన్స్ ఉంది..? ఇంతకీ ‘వారణాసి’ అనుకున్న సమయంలో విడుదల అవుతుందా..?

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 02:01 PM IST | Updated: Sep 22, 2026, 02:11 PM IST
Image Credit: రాజమౌళి, మహేష్ బాబు వారణాసి షూటింగ్ అప్‌డేట్..
Join

Mahesh Babu Rajamouli Varanasi Shooting:  బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాలతో నేషలన్, ఇంటర్నేషనల్ లెవల్లో అందరి ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. ఫస్ట్ టైమ్ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను నభూతో అన్న రీతిలో నిర్వహించి ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ బాబు తన ఫుల్ ఫోకస్ అంతా ‘వారణాసి’ మూవీపైనే పెట్టారు మహేష్ బాబు. మరోవైపు రాజమౌళి కూడా గత సినిమాల కంటే సూపర్ స్టార్‌తోనే సూపర్ ఫాస్టుగా షూటింగ్ చేస్తున్నారనే చెప్పాలి. ఓవైపు ప్రమోషన్.. మరోవైపు షూట్ రెండూ సంక్షేమం, అభివృద్ది తరహాలో బ్యాలెన్స్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే 90 శాతం షూట్ పూర్తైపోయిందట.  చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ అక్టోబర్ నాటికి పూర్తైపోతాయట.  ముందు చెప్పిన దానికంటే త్వరగానే టాకీ పూర్తి చేస్తున్నారు జక్కన్న.

IMAX ఫార్మాట్.. 

‘వారణాసి’ని IMAX ఫార్మాట్‌ షూట్ కూడా పూర్తైందని ఈ మధ్యే చెప్పారు రాజమౌళి. ఈ ఫార్మాట్ కోసం కథలో మార్పులేం చేయలేదన్నారు. ఆ కెమెరాలకు తగ్గట్లుగా చిన్నచిన్న సర్దుబాట్లు మాత్రమే చేసామన్నారు. ఈ సినిమాకు అటు ఐమాక్స్, ఇటు సినిమా స్కోప్‌కు సరిపోయేలా అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ చేస్తున్నామని చెప్పారు రాజమౌళి. డబ్బింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు సమాచారం. ఇపుడున్న జమానాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాత్రమే తమ పాత్రలకు ఇతర భాషల్లో వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇపుడు మహేష్ బాబు కూడా అదే తరహాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

అనోమార్ఫిక్ ఫ్రేమింగ్.. 

ఇక ‘వారణాసి’ సినిమాను అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ అంటే  అంటే సినిమా ప్రదర్శిస్తున్నపుడు ఆ స్క్రీన్‌కి తగ్గట్లు వీడియో అండ్ ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినకుండా.. అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకునేలా షూట్ చేసే ప్రక్రియ. అది మొదట్లో అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టినా.. తర్వాత అంతా సెట్ అయిందన్నారు దర్శక బాహుబలి జక్కన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు చెప్పినట్లుగానే 7 ఏప్రిల్ 7 2027న విడుదల  చేయడం పక్కా అని చెబుతున్నాడు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES