• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఆసక్తిరేకిత్తించే ‘నా వైఫ్ మిస్సింగ్’మూవీ..

ఆసక్తిరేకిత్తించే ‘నా వైఫ్ మిస్సింగ్’మూవీ..

Naa Wife Missing Review: అపుడెపుడో ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వరుణ్‌ సందేశ్‌, శ్వేతాబసు ప్రసాద్‌లు ఆ తరవాత మళ్లీ తెరపై జోడిగా కనిపించలేదు. దాదాపు 18 ల్యాంగ్ గ్యాప్ ఏళ్ల తర్వాత ఈ జోడి ‘నా వైఫ్‌ మిస్సింగ్‌’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ నెల 23 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ఎంగేజ్ చేసిందా..? వరుణ్, శ్వేతాల జోడి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయిందా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 10:05 IST|Updated: Oct 27, 2026, 17:09 IST
joinshare
ఆసక్తిరేకిత్తించే ‘నా వైఫ్ మిస్సింగ్’మూవీ..
Image Credit: Naa Wife Missing Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Naa Wife Missing Aha Review: తెలుగు తెరపై కొన్ని జంటలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్‌లు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ఎవరికి వారు తమదై ప్రయాణాన్ని కొనాసాగిస్తున్నారు. ఇక 18 ఇయర్స్ ల్యాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘ నా వైఫ్ మిస్సింగ్’ సినిమాలో కనువిందు చేశారు. మరి ఈ జంట మరోసారి ఆ మాయ రిపీట్ చేసిందా అనేది చూద్దాం.

కథ విషయానికొస్తే.. 
బాలు (వరుణ్ సందేశ్) ఓ బ్యాంక్ ‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా తన జీవితాన్ని లీడ్ చేస్తుంటాడు. అందమైన భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్). సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోకుండా భార్య కనిపించకుండా పోతుంది. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులు మాత్రం అతన్నే అనుమానించి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ బాలూ భార్య స్వప్న ఎలా మిస్ అయింది. ఆమె కనిపించకుండా పోవడానికి గల కారణాలేంటి..? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

‘కొత్త బంగారు లోకం’ సినిమా తర్వాత దాదాపు 18 యేళ్ల లాంగ్ తర్వాత వీళ్లిద్దరు జోడిగా కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 
దాదాపు పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ .. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడం.. థ్రిల్లర్ మూవీ  కావడంతో ఆటోమేటిగ్‌గా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. హీరో భార్య మిస్ అవుతుంది. ఆమెను ఎలా కనిపెట్టాడు. చివరకు ఏం జరిగిందనేది రెగ్యులర్ ఫార్మాట్ కథే అయినా.. ఇందులో చూపించిన లేయర్స్.. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఈ క్రమంలో భార్య మిస్సింగ్ కేసులో భర్త అరెస్ట్ కావడం.

ఇక భార్యకు గతంలో మరో వ్యక్తితో ప్రేమలో ఉండటంతో ఆమెను ఇంట్లోంచి పంపడానికి ఓ మిస్ అయిందనే నాటకం ఆడతాడ. తను ప్రేమించిన ప్రియుడు దగ్గరకు వెళ్లక ఎటు పోయిందనే అంశంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

సెకండాఫ్‌లో మిస్ అయిన హీరో భార్యతో పాటు గత కొంత కాలంగా మన సమాజంలో భార్య పెళ్లికి ముందే వేరేకరిని ప్రేమించడం. పెళ్లి తర్వాత ప్రియుడుతో లేచిపోవడం వంటి ఘటనలు చూస్తున్నాము. అలాంటి అంశాలను ఇందులో ప్రస్తావించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లవ్ ట్రాక్ చుట్టు తిరిగిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. సెకండాఫ్ స్లో నేరేషన్.. ప్రేక్షకులను అక్కడక్కడ ఇబ్బందులను కలగజేసినా ఓవరాల్‌గా కామన్ ఆడియన్స్ కు ఈ వీకెండ్ సరదగా ఈ సినిమా చూసేయవచ్చు. నిర్మాణ విలువులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఎడిటర్ సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓటీటీ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఓవరాల్‌గా దర్శకుడు తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు న్యాయం చేశాడు.

నటీనటుల విషయానికొస్తే..

వరుణ్ సందేశ్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్‌లో అతని యాక్టింగ్ బాగుంటుంది.శ్వేతా బసు ప్రసాద్ తన యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని సీన్స్‌లో మెప్పించింది. పోలీస్ క్యారెక్టర్‌లో సత్యశ్రీ నటన బాగుంది. ప్రవీణ్ పోలీస్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. మోహిత్ పెద్దాడ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ఓ మోస్తరు నటనతో మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎంగేజ్ చేసే ‘నా వైఫ్ మిస్సింగ్’..

రేటింగ్: 2.75/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie