• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /డిఫరెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆది సాయికుమార్.. ‘అరుంధతి నక్షత్రం’ సినిమాపై భారీ అంచనాలు..

డిఫరెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆది సాయికుమార్.. ‘అరుంధతి నక్షత్రం’ సినిమాపై భారీ అంచనాలు..

Aadi Saikumar: ఆది సాయికుమార్ తెలుగులో డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ ‘శంబాల’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆది.. తాజాగా ‘అరుంధతి నక్షత్రం’ పేరుతో సరికొత్త సినిమాకు ఓకే చెప్పాడు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 16, 2026, 00:20 IST|Updated: Nov 17, 2026, 12:25 IST
joinshare
డిఫరెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆది సాయికుమార్.. ‘అరుంధతి నక్షత్రం’ సినిమాపై భారీ అంచనాలు..
Image Credit: Aadi Sai Kumar (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arundhathi Nakshatram:  "అరుంధతి నక్షత్రం" పెళ్లైన కొత్త జంటలకు పెళ్లి తర్వాత పండితులు చూపిస్తున్నారు. అరుంధతి, వశిష్ఠల మాదిరే అన్ని జంటలు అన్యోన్యంగా కలగలిసి పోవాలనే సందేశం ఇస్తుంది. తాజాగా ఆది సాయికుమార్ హీరోగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది.  ఈ సినిమాలో  ఆది సరసన మేఘ శెట్టి, మధు దామరాజు  కథానాయికలుగా నటిస్తున్నారు.  ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ "అరుంధతి నక్షత్రం" సినిమాను సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.


తాజాగా  హైదరాబాద్ లో  "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆది తండ్రి యాక్టర్ సాయి కుమార్ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. "అరుంధతి నక్షత్రం" హీరోగా ఆది సాయికుమార్ 28వ సినిమా.

"అరుంధతి నక్షత్రం" సినిమా అనౌన్స్ మెంట్ సందర్బంగా మేకర్స్ స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేయడం విశేషం. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను గుర్తుచేసేలా మెమొరీ కార్డ్ లోని ఫొటోస్ ను పోస్టర్స్ గా ప్రింట్ చేసి "అరుంధతి నక్షత్రం" సినిమా తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా ఇది ఒక మంచి రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. ఈ నెలలోనే "అరుంధతి నక్షత్రం" సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమ బ్యానర్ కు మరింత పేరు తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని  ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie