• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /పీక్స్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్.. రామ్ రాజ్ కాటన్స్ న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘రౌడీ’..

పీక్స్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్.. రామ్ రాజ్ కాటన్స్ న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘రౌడీ’..

Vijay Devarakonda New Brand Ambassador Of Ram Raj Cottons: విజయ్ దేవరకొండ తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్‌లా దూసుకొచ్చి రాకెట్ వేగంలా దూసుకెళ్లతున్నాడు. అంతేకాదు మధ్యలో కొన్ని చిత్రాలు ఫ్లాపైనా విజయ్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అందుకు నిదర్శనం పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ విజయ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి. తాజాగా సాంప్రదాయ వస్త్రధారణలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ రాజ్ బ్రాండ్ ‌కు విజయ్ దేవరకొండ కొత్త అంబాసిడర్‌గా నియమించుకుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 11:11 AM IST|Updated: Oct 08, 2026, 12:48 PM IST
joinshare
పీక్స్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్.. రామ్ రాజ్ కాటన్స్ న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘రౌడీ’..
Image Credit: Ram Raj Brand Ambassador

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

2

Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

3

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

4

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

5

Mandaadi Box Office: సూరి, సుహాస్‌కు ఊహించని బ్లాక్‌బస్టర్.. మండాడి కలెక్షన్లు ఎంతో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijay Devarakonda Endorsements:  భారతీయ సంప్రదాయ వస్ర్త రంగంలో ప్రముఖ సంస్థ రామ్‌రాజ్‌ వెడ్డింగ్‌ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఇక లగ్న వెడ్డింగ్‌ కలెక్షన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండను రామ్‌రాజ్‌ సంస్థ నియమించింది.  సంప్రదాయానికి దగ్గరగా ఉంటూనే నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రామ్‌రాజ్‌ లగ్న వెడ్డింగ్‌ కలెక్షన్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు, ఆధునిక డిజైన్‌లు, స్టైలింగ్‌ మిశ్రమంగా కలెక్షన్లు ఉన్నాయి.  విజయ దేవర కొండను బ్రాండ్‌ అంబాసిడర్‌గా యాజమాన్యం ఆహ్వానించింది.

‘రామ్ రాజ్’వెడ్డింగ్‌ కలెక్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా విజయ దేవరకొండ..

మొత్తంగా విజయ్ దేవరకొండ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో తన నటనతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ యేడాది తన తోటి నటి రష్మికను రాజస్థాన్‌లో సాంప్రదాయ బద్దంగా వివాహాం చేసుకున్నారు. ఈయన పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక పెళ్లి తర్వాత విజయ్, రష్మికలు తొలిసారి ‘రణబాలి’ చిత్రంలో కలిసి నటించారు.

‘రణబాలి’ మూవీతో పలకరించనున్న విజయ్,రష్మిక దంపతులు..

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా పీరియాడిక్ పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన రణబాలి అనే యోధుడి కథతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ పీక్స్‌లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓ రకంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ అనేది కీలకం అనే చెప్పాలి. పైగా తనకు గతంలో హిట్ ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు. తన జీవిత భాగస్వామితో కలిసి నటించడం వంటి అంశాలు ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏది ఏదైనా  జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ ఓ వైపు క్రేజీ సినిమాలు చేస్తూనే పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. 
 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News