• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘రణబాలి’తో రాయలసీమ గడ్డ ఋణం తీర్చుకున్నా.. విజయోత్సవ సభలో విజయ్ దేవరకొండ ఎమోషనల్..

‘రణబాలి’తో రాయలసీమ గడ్డ ఋణం తీర్చుకున్నా.. విజయోత్సవ సభలో విజయ్ దేవరకొండ ఎమోషనల్..

Ranabaali Ranabheri: విజయ్ దేవరకొండ టైటిల్ రోల్లో రష్మిక మందన్న కథానాయికగా నటించిన చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాయలసీమలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా రాయలసీమతో తన అనుబంధాన్ని పంచుకున్నారు విజయ్ దేవరకొండ.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 12:10 AM IST|Updated: Oct 24, 2026, 12:15 PM IST
joinshare
‘రణబాలి’తో రాయలసీమ గడ్డ ఋణం తీర్చుకున్నా.. విజయోత్సవ సభలో విజయ్ దేవరకొండ ఎమోషనల్..
Image Credit: Ranabaali Success Meet (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

2

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

3

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

4

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

5

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్ రసవత్తరంగా పరిషత్ పోరు..ప్రధాన పార్టీల నుంచి పోటెత్తిన నామినేషన్లు..ఎవరి బలమెంత?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijay Devarakonda Emotional About Ranabaali Success: నిన్న రాయలసీమ గడ్డ మీద జరిగిన ‘రణబాలి’విజయోత్సవ సభలో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు గడ్డ ఎంతో గొప్పది, అందమైనది. ఈ గడ్డ పై  ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ ప్రాంతాల్లో  రకరకాల పండుగలు, పద్దతులు, యాసలు, మనుషులు ఉన్న నేల మనది. నేను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం ఉంటుందన్నారు. తిరగబడే పోరాట నైజం ఈ మట్టి సొంతమన్నారు. మరోవైపు  ఫోక్ సాంగ్స్ లో మజా ఉంటుంది.

నేను చూసిన థియేటర్‌లో నా సినిమా ఆడటం ఆనందంగా ఉంది..

ఆంధ్ర వెళ్తే చక్కటి వాతావరణం, మంచి మనుషులు, ఆప్యాయత, వాళ్లు జరుపుకునే అందమైన పండుగలు, మంచి జానపదాలుంటాయన్నారు.  సీమకు వస్తే ‘రణబాలి’లో రాయలు ఏలిన సీమ గడ్డ అంటూ ఒక పాట ఉంది. అది నా మనసుకు నచ్చింది.  ఈ నాలుగు లైన్ల పాట మన సీమ ఎలాంటిదో చూపిస్తాయన్నారు.  ఈ రాయలసీమ నాకు ఎంతో ఇచ్చింది. నేను చదువుకుంది ఇక్కడే. ఇక్కడ కొత్త చెరువు అనే ఊరిలో ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు మా ‘రణబాలి’ సినిమా అదే కొత్త చెరువు థియేటర్ లో హౌస్ ఫుల్స్ అవుతుంటే ఎంత అనందంగా ఉందో చెప్పలేనన్నారు.

రాయలసీమ ఋణం..

నేను ప్రయాణం చేసిన అనంతపురం, కర్నూలు, కడప లోనే మా సినిమా షూటింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేవన్నారు. రణబాలి సినిమాను ఒక నటుడిగా చేయలేదు. ఈ నేల కథను చెప్పాలనే బాధ్యతతో చేశాను. నాకు ఎంతో ప్రేమను పంచిన రాయలసీమ ఋణం తీర్చుకోవాలనే కృతజ్ఞతతో రణబాలి సినిమా చేశాను. ఒక పెద్దాయన మా వీరుల కథ చెప్పావు బిడ్డా అని చేయి పట్టుకుని మాట్లాడుతుంటే ఎంతో ఆనందం వేసిందన్నారు.


మీ ఆదరణ మరవలేనిది.. 
మమ్మల్ని మేము తెరపై చూసుకున్నట్లు ఉందని మీరంతా చెబుతున్నారు. మీ ఆదరణతో వచ్చే తృప్తి ఏ డబ్బూ, ఏ అవార్డు ఇవ్వదని కాస్త భావోద్వేగానికి గురయ్యారు. రణబాలి సినిమాను మీరు ఇంతగా అక్కున చేర్చుకోవడం నటుడిగా నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిందన్నారు.  తెలుగు సినిమా గర్వపడేలా రణబాలి ఉంటుందని చెప్పాను. ఆ మాటను మీరు నిజం చేశారు. రాహుల్ ఎంత గొప్ప సినిమా చేశాడో భవిష్యత్ లో అందరికీ అర్థమవుతుంది. జయమ్మపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు నాపై పదేళ్లుగా ప్రేమ చూపిస్తున్నారు. ఇటీవల ఆ ప్రేమను మరింతగా చూస్తున్నామన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie