SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టాలీవుడ్ కొత్త డైరెక్టర్‌తో యశ్ ప్యాన్ ఇండియా మూవీ.. రాకీ భాయ్ కొత్త ప్లాన్ ఇదేనా..!

Yash New Pan India Project: కేజీఎఫ్ సిరీస్‌తో యశ్ యశస్సు ప్యాన్ ఇండియా రేంజ్‌లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్న రాకీ భాయ్.. చివరకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో ‘టాక్సిక్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. దీంతో యశ్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నాడనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా యశ్ కొత్త తెలుగు డైరెక్టర్ హనుమా రెడ్డితో నెక్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు శాండిల్ వుడ్ వర్గాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 10, 2026, 12:19 PM IST | Updated: Oct 10, 2026, 12:21 PM IST
Image Credit: Yash New Project
Join

Yash Hanuma Reddy Project: కేజీఎఫ్ తో వచ్చిన ఇమేజ్ ‘టాక్సిక్’తో గంగలో కలిపింది. దీంతో యశ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ‘టాక్సిక్’ కోసం ఎక్కువ సమయం తీసుకున్న యశ్.. ఇపుడు టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కొత్త దర్శకుడు హనుమా రెడ్డితో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు కన్నడ సినీ వర్గాలు చెబుతున్న మాట.

ప్రస్తుతం యష్ బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'సిరీస్‌లో  రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో యష్ పాత్రపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ఆయన ఒక ప్రొడ్యూసర్ కూడా.  అలాగే 'టాక్సిక్' (Toxic) అనే మరో విభిన్నమైన యాక్షన్ ప్రాజెక్ట్‌లోనూ నిర్మాణ భాగమయ్యారు. అయితే, ఇటీవల ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ వినిపించినప్పటికీ, యష్ స్టార్‌డమ్‌కి, ఆయనకున్న క్రేజ్‌కి ఏమాత్రం ఢోకా లేదనే విషయం ఓపెనింగ్స్‌తో తెలిసొచ్చింది.  ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అగ్ర దర్శకులు, బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి.

ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, యష్ తన తదుపరి చిత్రాన్ని ఓ టాలీవుడ్ కొత్త డైరెక్టర్‌తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ ఫేమ్ హనుమా రెడ్డి యక్కంటి. తొలి సినిమా ఇంకా విడుదల కాకముందే, హనుమ రెడ్డి ఏకంగా యష్ లాంటి పాన్-ఇండియా స్టార్‌కు కథ వినిపించి ఇంప్రెస్ చేసాడట.  ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

'డేవిడ్ రెడ్డి' విషయానికొస్తే, ఇది హనుమ రెడ్డికి తొలి చిత్రమే అయినా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మంచు మనోజ్ తో పాటు సముద్రఖని, రమ్యకృష్ణ వంటి సీనియర్ నటీనులు  ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.  కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ, సుప్రీమ్ సుందర్ స్టంట్స్ సమకూరుస్తున్నారు. ఇంతటి భారీ సాంకేతిక నిపుణులతో తన తొలి చిత్రాన్నే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.  'డేవిడ్ రెడ్డి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, యష్ తో సినిమా చేసే అవకాశం ఈజీ అయ్యే అవకాశాలున్నాయి.  అయితే ఈ భారీ క్రేజీ కాంబినేషన్ పై యష్ లేదా దర్శకుడు హనుమ రెడ్డి వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES