Ramayana Records: ‘రామాయణ’ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే పలు రికార్డులకు పాతర వేసింది. తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు రూ. 502 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దుమ్ము దుమారం రేపుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ అన్ని మార్కెట్స్‌లో కలిపి మొత్తంగా 54 మిలియన్ యూఎస్ డాలర్స్‌ను కలెక్ట్ చేసింది. ఒక్క్ నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. కేవలం 8 రోజుల్లోనే రూ 1000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో ఇండియన్ మూవీగా సంచలనం రేపింది. మొత్తంగా హిందీలో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 6వ చిత్రం. ఓవరాల్‌గా ఇండియన్ చిత్రాల్లో 11వ చిత్రంగా రామాయణ సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది.
ఓవర్సీస్‌లో దూకుడు..
ప్రస్తుతం నార్త్ అమెరికా ఆల్ టైమ్ టాప్ ఇండియన్ గ్రాసర్స్ లిస్టులో రామాయణ పార్ట్ 1 ప్రస్తుతం సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరో 3.65 మిలియన్ డాలర్స్ రాబడితే ఈ సినిమా దురంధర్ 2 పేరిట ఉన్న రికార్డును క్రాస్ చేయవచ్చు. బాహుబలి 2 రికార్డును దాటడానికే ఎనిమిదేళ్ల సమయం పట్టింది. అలాంటి రామాయణ .. దురంధర్ 2 విడుదలైన ఆరు నెలల్లో ఈ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ఇక ఈ సినిమా 13 రోజుల్లో రూ. 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు..
ప్రస్తుతం ‘రామాయణ’ సినిమా పఠాన్, కేజీఎఫ్ 2, జవాన్, ఆర్ఆర్ఆర్ సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసింది. ప్రముఖ సినిమా ట్రేడ్ చెప్పే Sacnilk వెబ్ సైట్ ప్రకారం.. ఈ సినిమా కంటే ముందు దంగల్ మూవీ రూ. 2070.30 కోట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. అటు ధురంధర్ 2 ది రివేంజ్ సినిమా రూ. 1813.39 కోట్లతో రెండో ప్లేస్లో ఉంది. బాహుబలి 2 రూ. 1788.06 కోట్లతో మూడో స్థానంలో ఉంది. పుష్ప 2 ది రూల్ సినిమా రూ. 1742.10 కోట్లతో నాల్గో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ. 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఐదో స్థానంలో ఉంది. త్వరలో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటుందా అనేది చూడాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 42 కోట్ల షేర్ (రూ. 80 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మన దేశంలో మలయాళం, కన్నడ, తమిళంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే రూ. 1620 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మరో 120 కోట్లు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. మొత్తంగా మన దేశంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తంగా కొండంత ఉన్న టార్గెట్ ఈ సినిమా మెల్లమెల్లగా క్రాస్ చేయడం పక్కా అని చెప్పాలి. అంతేకాదు వచ్చే యేడాది చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో విడుదల కాబోతుంది. అక్కడ ఈ సినిమా ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి మరి.