• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ప్రపంచ నేతల ప్రశంసలు అందుకుంటున్న భారత్ పైలట్ స్మిత్ మచ్చర్..

ప్రపంచ నేతల ప్రశంసలు అందుకుంటున్న భారత్ పైలట్ స్మిత్ మచ్చర్..

Flight Dubai: ఆకాశంలో అలా సాగుతున్న విమాన ప్రయాణం. హఠాత్తు పరిణామం 174 మంది ప్రాణాలపై కుట్ర జరిగింది. గుర్తించిన పైలట్ గగనతలంలో ముంచుకొచ్చిన మృత్యువుతో భారత్ పైలట్ స్మిత్ మచ్చర్ పోరాటం చేశాడు. తనకు తానుగా రక్షించుకోవడమేకాదు… 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఇపుడు ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. తాను మృత్యువు నుండి బయటపడటమే కాకుండా.. ఎంతో మంది కాపాడిన వ్యక్తిగా ప్రపంచ మొత్తంతో కీర్తించబడుతున్న ఆయన ఎవరు.. ?

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 03:43 PM IST|Updated: Oct 01, 2026, 04:00 PM IST
joinshare
ప్రపంచ నేతల ప్రశంసలు అందుకుంటున్న  భారత్  పైలట్ స్మిత్ మచ్చర్..
Image Credit: Smith Machchar (File/SourceP

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Smith Machchhar: ఫ్లై దుబాయ్ దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఊహించని భయానక ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్ లోపల జరిగిన ఈ అనూహ్య పరిణామంతో పైలట్ మచ్చర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. క్షణాల్లో తేరుకుని తనకు తానుగా రక్షించుకుని, విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడి చరిత్ర సృష్టించాడు.

ఒమన్‌కు చెందిన కో పైలట్  ఉగ్రవాదిగా మారి ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కాక్‌పిట్‌లో రక్తం కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో విమానం 33వేల అడుగుల నుంచి 17వేల అడుగులకు, దాదాపు 14వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కో పైలట్ గా ఉన్న వ్యక్తి పైలట్ పై కత్తితో దాడి.. 
కో పైలట్ ఉగ్ర కుట్రను గుర్తించిన పైలట్-ఇన్-కమాండ్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో ఘోర ప్రమాదాన్ని తప్పించాడు. ప్రాణాలను పణంగా పెట్టి శక్తియుక్తులను ప్రదర్శిచి మృత్యువును జయించాడు. ప్రమాదకర పరిస్థితిలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశారు. దీంతో తోటి ప్రయాణికులు, విధుల్లో లేని మరో ఇద్దరు పైలట్ల సహాయంతో, దాడికి పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడేలా చేశారు.

ప్రయాణం చేస్తున్న విమానంలో జరిగిన ఘటనతో ఇజ్రాయెల్ అధికారులు ఖంగుతిన్నారు. దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సాహసోపేతమైన చర్యతో వందలాది మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.  

భారత పైలట్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తి ..
ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదాన్ని తప్పించిన పైలట్ స్మిత్ మచ్ఛర్ ఎవరని నెటజన్లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. భారత సంతతికి చెందిన స్మిత్ మచ్ఛర్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన జూన్ 2022 నుంచి ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానాల్లో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. 737-800, 737 MAX 8,9 విమానాలను నడిపిన అనుభవం ఉంది. 9,750 గంటల పాటు విమానం నడిపిన అనుభవం మచ్చర్ సొంతం. ఫ్లై దుబాయ్‌లో చేరడానికి ముందు, ఆయన ముంబైలోని స్పైస్‌జెట్‌లో 11 యేళ్లు పనిచేశారు. ఆయన సీనియర్ కమాండర్‌గా కూడా పనిచేశారు, ఆ తర్వాత నవంబర్ 2020లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్ అయ్యారు. ఈ హోదాలో ఆయన ఇతర పైలట్‌లకు శిక్షణ ఇచ్చారు.

పైలట్ స్మిత్ మచ్ఛర్ ముంబైలోని ఘట్‌కోపర్ ఈస్ట్‌కు చెందినవారు. ఉద్యోగ కోసం దుబాయ్‌లో నివసిస్తున్నారని సమాచారం.  ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరో విమానయాన సంస్థలో కెప్టెన్ పదవుల్లో ఉన్న పైలట్లను నియమించుకుని, వారిని నేరుగా కెప్టెన్‌లుగా నియమించే అవకాశం విమానయాన సంస్థలకు ఉంటుంది. స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా అతనికి 6,400 గంటలకు పైగా అనుభవం ఉందని మచ్చర్ ప్రొఫైల్ లో ఉంది.  మచ్ఛర్ జూన్ 2007 నుంచి ఏప్రిల్ 2008 మధ్య వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మచ్ఛర్ సోదరుడు కూడా అకాసా ఎయిర్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు.

మచ్చర్ పై నెతన్యాహూ ప్రశంసలు..

విమాన ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రస్తుతం సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్  ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ఘనంగా సెల్యూట్ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన వీరత్వం వల్ల ఒక భారీ ఆకాశ విపత్తు తప్పిందని నెతన్యాహు పేర్కొన్నారు. నెతన్యాహు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, కెప్టెన్ స్మిత్‌ను  నిజమైన హీరో  గా అభివర్ణించారు.

My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.

Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…

— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026

 

మచ్చర్‌ను పొగడ్తల వర్షం కురిపించిన డొనాల్డ్ ట్రంప్ ..

ప్రాణాలతో పోరాటంచేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిని పైలట్ గ్రేట్ మ్యాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు.భారత పైలట్ బాధ్యతాయుతంగా పైలట్ స్మిత్ మచ్చర్ ఉగ్రకుట్రను భగ్నం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అసాధారణ ధైర్యంతో చేసిన పోరాట పటిమ గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 
 
 

Captain Smit Machchhar has shown the world the highest form of courage.

Without fearing for his own life, he fought valiantly and prevented another 9/11 like attack from happening. 

140 crore Indians salute Captain Smit and are praying for his well-being. pic.twitter.com/YGTA9CFCAg

— Narendra Modi (@narendramodi) October 1, 2026

 ఫై దుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ వీరత్వాన్ని దేశంలోనూ , పొరుగు దేశాల్లోనూ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.

 

BREAKING: President Trump says an Israeli plumber with virtually no flying experience sprang into action as an Israel-bound jet plunged toward the ground.

Trump says the passenger heard screams, rushed forward and ripped the alleged attacker from the pilot's seat. pic.twitter.com/bSMMrZUSGJ

— Fox News (@FoxNews) September 30, 2026

ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్ క్షణకాలం అలక్ష్యం చేసి ఉంటే.. ఆయన ప్రాణాలతోపాటు 174 మంది ప్రయాణికుల పరిస్థితిని తలచుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సహాకారంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Donald Trump
America
PM Modi