యూఎస్ విమానయాన రంగంలో అనూహ్య పరిణామం.. భద్రతా కారణాలతో అన్ని విమాన సేవలు బంద్..
US Aviation:అమెరికా విమానయాన రంగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భద్రతా కారణాలతో దేశవ్యాప్తంగా అన్ని విమాన సేవలు బంద్ అయ్యాయి. తక్షణమే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.
America Avition Flights Stopped: అసాధారణ పరిస్థితుల వల్ల అమెరికా వ్యాప్తంగా బయలుదేరాల్సిన అన్ని విమానాలను నిలిపివేస్తూ FAA (Fedaral Aviation Admistration) అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయడం ఇది కేవలం రెండోసారి. గతంలో 2023 జనవరిలోనూ కంప్యూటర్ వ్యవస్థ మొరాయించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తింది.
తక్షణమే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన FAA..
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల మధ్య ప్రయాణించే విమానాలను నియంత్రించే 22 ప్రాంతీయ ATC కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య తలెత్తినట్లు రవాణా శాఖ కార్యదర్శి షాన్ డఫీ తెలిపారు. భద్రతా కారణాలు, అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు FAA ప్రకటించింది. అయితే, దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, కుట్ర గానీ ఉన్నట్లు ఆధారాలు లేవని తేలింది.ఇది కేవలం టెలికమ్యూనికేషన్ల అంతరాయం మాత్రమేనని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ స్పష్టం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
భద్రత, అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన FAA..
నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత అమెరికా వ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా ప్రయాణికులతో సుమారు 11వేల విమానాలు టేకాఫ్ కావాల్సి ఉండగా, ఈ ఆకస్మిక నిర్ణయంతో అవన్నీ నిలిచిపోయాయి. వారాంతపు సెలవులు, వివాహ వేడుకలు, క్రీడా ఈవెంట్లకు వెళ్లే ప్రయాణికులు ఈ పరిణామంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రన్‌వేపైకి వెళ్తున్న విమానాలను సైతం వెనక్కి పిలిపించి, లగేజీని కిందకు దించేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విమానాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు.