• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..

సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..

FIR Filed on Kangana: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షరాలు.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత సోనియా గాంధీ రాసిన ఆత్మ కథ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాదు వివాదాస్పదం అవుతుంది. అందులో సోనియా తనకు తమకు పార్టీకి అవసరమైన వాటినే హైలెట్ చేసిందనే వాదనలు ఉన్నాయి. తమకు ఇబ్బంది కరంగా ఉన్న అంశాలను తొక్కిపెట్టిందనే బీజేపీ నాయకులు చెబుతున్న మాట. ఇక సోనియా గాంధీ.. విదేశాల నుంచి మన దేశానికి చెందిన శత్రువు గూఢచారి అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పద మయ్యాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 09:30 AM IST|Updated: Nov 14, 2026, 09:33 AM IST
joinshare
సోనియా పై వ్యాఖ్యలు..  బీజేపీ ఎంపీ, నటి కంగనా  పై పోలీసుల FIR..
Image Credit: Kangana Sonia Gandhi (ZEE Telugu News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

2

డిసెంబర్ 11 నుంచి శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి రాజయోగం.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని విజయాలు!

3

సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..

4

యూఎస్ విమానయాన రంగంలో అనూహ్య పరిణామం.. భద్రతా కారణాలతో అన్ని విమాన సేవలు బంద్..

5

అయ్యప్ప స్వామి దీక్షలో నల్లవస్త్రాలనే ఎందుకు ధరించాలి.. !!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sonia Gandhi Vs Kangana: సోనియా గాంధీ రాసిన పుస్తకం ‘బీలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్’ వివాదాస్పదం అవుతుంది. ఇందులో ఆమె  బోఫోర్స్ కుంభకోణం, భోపాల్ కార్బైడ్ గ్యాస్ లీక్ నిందితుడు ఖత్రోచి భారత్ నుంచి పారిపోవడం వెనక అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ప్రమేయం ఉందనే విషయాన్ని తొక్కి పెట్టిందన్నారు. మరోవైపు బాబ్రీ కూల్చివేతపై కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. కశ్మీర్‌లో ఉగ్రవాదులు  .. పండితులను  ఊచకోత కోసినపుడు ఎందుకు కన్నీళ్లు రాలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. గుజరాత్ గోద్రా అల్లర్లను ప్రస్తావించిన సోనియమ్మ.. కశ్మీర్‌లో హిందువుల ఊచకోతతో పాటు సిక్కు అల్లర్లు సహా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన గొడవలపై ఎందుకు ప్రశ్నించలేదనేది బీజేపీ నాయకులు వేస్తోన్న ప్రశ్న. ఇక సోనియా గాంధీ విదేశీ ఏజెంట్ అంటూ బీజేపీ ఫైర్ బ్రాండ్ సిమ్లా ఎంపీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  

సిమ్లాకు చెందిన అతుల్ శర్మ డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిననటు వంటి  వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సిమ్లాకు చెందిన అతుల్ శర్మ ఈ వ్యవహారంపై డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు చేశారు. కంగనా వ్యాఖ్యలు విద్వేషాలను ప్రోత్సహించేలా, రాజ్యాంగంపై విధేయతను ప్రశ్నించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్ణీత కాలపరిమితిలో విచారణ జరపాలని కోరారు.

బీఎన్ఎస్ లోని సెక్షన్ 353, 356, 196 కేసు ..

కంగనా సోషల్ మీడియా పోస్టుల్లో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీల మరణాలపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. సోనియా గాంధీని అనుమానాస్పద విదేశీయురాలిగా చిత్రీకరించారని ఆరోపించారు. ఆధారాలు లేని ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రమాదం ఉందని  తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదు నేపథ్యంలో సిమ్లా పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్ఎస్పీ గౌరవ్ సింగ్ ధ్రువీకరించారు. బీఎన్ఎస్ లోని సెక్షన్ 353, 356, 196 కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Congress
BJP