వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!
Deer Chewing Snake Viral Video: ఒక జింక అత్యంత ప్రమాదకరమైన పామును నమిలి తింటున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. అసలు ఆ జింక పామును అలా ఎందుకు నమిలి తిన్నది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Deer Chewing Snake Video: సాధారణంగా జింక అనగానే పచ్చిక బయళ్లలో గడ్డిమేసే సాధజీవిగా చెప్పుకుంటూ ఉంటారు.. కానీ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒక జనావాసాల్లో ఉన్న జింక.. ఎలాంటి భయం లేకుండా అత్యంత విషపూరితమైన పామును నములుతూ కనిపిస్తున్న దృశ్యాలు అందర్నీ షాక్కు గురిచేస్తున్నాయి. జింకలు ఇలా కూడా చేస్తాయా అని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అసలు ఈ వీడియో ఎక్కడిది? జింక ఇలా పామును తినడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రికార్డ్ అయిన వీడియో వివరాల ప్రకారం.. ఈ వీడియోలో రికార్డు చేసిన వ్యక్తి ఆశ్చర్యంతో చూస్తుండగానే.. ఆ జింక ఎంతో సహజంగా పాములు నమిలి మింగేయడం మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. దీన్ని చూసిన చాలామంది శాకాహారి జీవి ఇలా పామును తినడమేంటి? ఆహారపు గొలుసు మారిపోయిందా? లేదా వాతావరణం మారుతున్న కొద్ది.. జీవులు కూడా ఇలా మారుతూ వస్తున్నాయా అంటూ.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు..
సైన్స్ ఏమి చెబుతోంది?
వన్యప్రాణి శాస్త్రవేత్తల ప్రకారం.. జింకలు ప్రాథమికంగా శాకాహారులే అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవి మాంసాహారులుగా ప్రవర్తిస్తూ ఉంటాయని చెబుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో పోషకాల కోరత ఏర్పడడమేనని వన్య ప్రాణి సంరక్షకులు చెబుతూ వస్తున్నారు..
జింకల శరీరంలో ఎముకల తో పాటు కొమ్ములు వేగంగా పెరిగే సమయంలో లేదా గర్భాధారణ సమయంలో వాటికి క్యాల్షియంతో పాటు సోడియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అత్యధికంగా అవసరమవుతూ ఉంటాయి. పచ్చి గడ్డితోపాటు ఆకులలో ఈ ఖనిజాలు తగినంతగా లభించకపోవడంతో.. ఇవి ఎలుకలతో పాటు చిన్న చిన్న జీవుల అవశేషాలను తింటూ ఉంటాయి. ఇలా తినడాన్ని కూడా జీవశాస్త్రంలో క్లియర్‌గా వివరించారు..
జింకలు క్రూర జంతువులు లాగా.. ప్రత్యేకంగా వేటాడవు.. దారిలో చనిపోయి పడి ఉన్న జంతువులతో పాటు నేలపై కనిపించే పక్షుల గుడ్లు, చిన్నపిల్లలు లేదా గాయపడిన కదల్లేని స్థితిలో ఉన్న పాములు కనిపించినప్పుడు ఆ ఖనిజలోపాల కారణంగా వాటిని నమిలి తింటూ ఉంటాయి.. చనిపోయిన పాము శరీర భాగాలను లేదా రక్తనాళాలను నమలడం వల్ల పాము విషం జీర్ణకోశంలోకి వెళ్లిన నేరుగా రక్తంలో కలవకపోతే.. ఇలాంటి ప్రభావం చూపదని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు..