• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /దీపావళి వేడుకల్లో చెయ్యి కాలితే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఈ 5 నిమిషాల చిట్కా మీ చర్మాన్ని కాపాడుతుంది!

దీపావళి వేడుకల్లో చెయ్యి కాలితే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఈ 5 నిమిషాల చిట్కా మీ చర్మాన్ని కాపాడుతుంది!

దీపావళి అంటే దీపాల పండుగ. పటాసులు కాల్చడం ఆనవాయితీ. అయితే దీపావళి వేడుకల్లో పటాసులు కాల్చేటప్పుడు మీ చేయి కాలిందా? ఐదు నిమిషాల్లో ఏం చేస్తే మీ చర్మం ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా ఉంటుంది? టూత్ పేస్ట్, ఐస్ వంటివి కాదు, ఈ చిట్కా పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది.

Written ByRenuka Godugu
Published: Nov 08, 2026, 09:41 PM IST|Updated: Nov 08, 2026, 09:43 PM IST
joinshare
దీపావళి వేడుకల్లో చెయ్యి కాలితే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఈ 5 నిమిషాల చిట్కా మీ చర్మాన్ని కాపాడుతుంది!
Image Credit: Diwali Burn First Aid: File

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

2

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

3

Rajamouli: యాంకర్ తో రాజమౌళి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

4

Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

5

Samantha: పెళ్లి తర్వాత సమంత డైట్ సీక్రెట్స్..హెల్తీ లైఫ్ కోసం 7 సింపుల్ టిప్స్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Burn First Aid: దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పటాసులతో పాటు రాకెట్లు, భూ చక్రాలు, చిచ్చుబుడ్డీలు వెలిగిస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా నిర్వహించుకునే పండుగ ఇది. అయితే దీపావళి సమయంలో మీకు ఏమైనా గాయాలయ్యాయా? ప్రధానంగా చేతులకు గాయాలు అవుతుంటాయి. ఈ సమయంలో చాలామంది టూత్ పేస్టు రాయడం, ఐస్ రుద్దడం వంటివి చేస్తుంటారు. ఇది మరింత ప్రభావాన్ని పెంచుతుంది. చేయి కాలిన వెంటనే 20 నిమిషాల పాటు చల్లని, ట్యాప్‌ రన్నింగ్‌ నీటిలో ఉంచాలి. దుస్తులు ఫుల్ స్లీవ్స్ ఉంటే వాటిని కూడా వెంటనే తొలగించండి. పరిస్థితి మరింత దిగజారితే వైద్యులను సంప్రదించడం కూడా అవసరం.

దీపావళికి చేయి కాలితే ఐదు నిమిషాల్లో ఏం చేయాలి?
చేయి కాలిన వెంటనే, రన్నింగ్ ట్యాప్ వాటర్‌లో 20 నిమిషాలు అలాగే ఉంచాలి. చేతికి ఉంగరాలు, గాజులు ఉంటే వెంటనే తొలగించాలని వైద్యులు సూచిస్తున్నారు. వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించండి. ఐస్ అస్సలు పెట్టకూడదు, బట్టర్, టూత్ పేస్ట్ వంటి హోమ్ రెమెడీలు రుద్దకూడదు. ఆ గాయం పైన ఉన్న ఫుల్ స్లీవ్స్ దుస్తులను బలవంతంగా లాగడానికి ప్రయత్నించకూడదు. ఏదైనా కవర్, ప్లాస్టిక్ బ్యాగ్ లేదా నాన్-స్టిక్ డ్రెస్సింగ్ వేసుకొని, ఆ తర్వాత దుస్తులను జాగ్రత్తగా తొలగించండి.

వెంటనే నొప్పి తగ్గాలంటే పారాసిటమాల్ వేసుకోవడం మంచిది. అయితే ముందుగా లేబుల్‌పై ఉన్న డోసును తనిఖీ చేసుకోవాలి. చేతిని కాస్త పైకి లేపి ఉంచితే వాపు తగ్గుతుంది. కాలిన వ్యక్తి ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కాలిన వెంటనే చల్లబడిపోతుంటారు, కాబట్టి వారు వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Read Also: దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

ఈ హోమ్ రెమెడీస్ అస్సలు ప్రయత్నించకండి..
పటాసుల వల్ల గాయాలైతే చాలామంది వెంటనే నెయ్యి, బట్టర్, టూత్ పేస్ట్ వంటివి వాడుతుంటారు. ఇది ప్రమాదకరం. కోల్డ్ వాటర్‌ను కూడా నేరుగా ఉపయోగించకూడదు. పసుపు, ఏదైనా పిండి వంటివి గాయాలను మరింత ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తాయి. యాంటీ సెప్టిక్ క్రీములు, ఆయింట్‌మెంట్లు వెంటనే అవసరం ఉండదు.

వెంటనే వైద్యులను సంప్రదించండి..
అరచేతిలో పూర్తిగా గాయాలైనవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖం, మెడ, చేతులు, కాళ్లకు ఎక్కువగా కాలిన గాయాలైతే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. చర్మం తెల్లగా కనిపించినా, బ్రౌన్ రంగులోకి మారినా, పిల్లలైతే కచ్చితంగా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మధుమేహం ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఇలాంటి ప్రమాదం జరిగిన వెంటనే శ్వాస సమస్యలు కూడా వస్తాయి, అలాంటప్పుడు కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Festivals
Telugu News