SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abdulla Shahid: పలువురు మైనర్లపై లైంగిక వేధింపులు.. మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అరెస్ట్..

Case on Ex Maldives foreign minister: అబ్దుల్లా షాహిద్ సెప్టెంబర్ 2022 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ క్రమంలో మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం రాజుకుంది.

Written By Inamdar Paresh
Published: Nov 03, 2026, 03:16 PM IST | Updated: Nov 03, 2026, 03:37 PM IST
Image Credit: Abdulla Shahid (file)
Join

Child Abuse case on ex Maldives foreign minister Abdulla shahid:  మాల్దీవుల ప్రతిపక్ష నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నేరుగా అబ్దుల్లా షాహిద్ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పలువురు మైనర్లకు మాయ మాటలు  చెప్పి లైంగికంగా దాడి చేశాడని ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఈ విధంగ అప్రతిష్టపాలు చేస్తున్నారని, ఈ ఆరోపణల్ని ఖండించారు. 2028 ఎన్నికలకు ముందు తన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) అధ్యక్ష ప్రైమరీ కోసం బరిలో దిగి ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. 

మరోవైపు అబ్దుల్లా షాహిద్.. సెప్టెంబర్ 2022లో ఒక ఏడాది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అదే విధంగా.. మాల్దీవుల ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన షాహిద్, రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2008 వరకు అప్పటి అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ హయాంలో, 2018 నుండి 2023 వరకు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ హయాంలో ఆయన తన బాధ్యతల్ని నిర్వర్తించారు. 

అంతే కాకుండా..2009 నుండి 2014 వరకు పీపుల్స్ మజ్లిస్ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1984లో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖలో తన ప్రభుత్వ సేవా వృత్తిని ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన వృత్తి జీవితంలో అనేక దౌత్య, రాజకీయ పదవులను నిర్వహించారు.

2021 సంవత్సరంలో జాతీయ, అంతర్జాతీయ సేవలకు గుర్తింపుగా మాల్దీవుల అత్యున్నత రాష్ట్ర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజ్జుద్దీన్'ను  షాహిద్‌కు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు అంశం పెను వివాదంగా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES