Imran Khan News.. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆపై ప్రధాన మంత్రిగా విలక్షణ రాజకీయ నేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఒకటికాదు… రెండుకాదు.. ఆయనపై వందల కేసులు నమోదయ్యాయి. ఆయన పొలిటికల్ లైఫ్ మొత్తం కంపు కంపు అయింది. సిన తప్పులకు వయసు మీరిన తర్వాత జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. జైల్లోనూ నిద్రపట్టని రాత్రులు గడపాల్సివస్తోంది. తాజాగా ఈయన తాను ఆపదలో ఉన్నానని...ప్రాణాలతో తిరిగొస్తానో లేదో తెలియడం లేదంటూ జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఎప్పుడైనా బ్రెయిన్ హెమరేజ్, గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు తనకు చెప్పారని తెలిపారు. తన భార్య బుష్రా బీబీ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు ఆయన ఓ లేఖ రాయడం సంచలనంగా మారింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బేఖాతరు..
తనకు చికిత్స అందించాలంటూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేయడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపారు. తన భార్య బుష్రా బీబీ కూడా జైలులోనే ఉన్నారని, ఆమెకు సరైన చికిత్స చేయకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులే సుప్రీంకోర్టుకు లేఖ రాయడానికి కారణమని తెలిపారు.
తాను ప్రాణాలతో బయటకు వస్తాననే ఆశలు లేవు..
74ఏళ్ల వయసులో ఈ పరిస్థితులు నన్ను తిరిగి ప్రాణాలతో వస్తానో రానో అని ఒకింత నైరాశ్యంలో మాట్లాడినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నయి. జైలులో తాను ఒంటరిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతించాలని వైద్యులు చెప్పిన చెవికి ఎక్కించుకోవడం లేదన్నారు.
ఇమ్రాన్ కు కంటి సమస్యలు..
గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ కంటి చూపు మందగించింది. దీంతో ఆయనను కంటి పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు అధికారిక వర్గాలు చెబుతున్న మాట. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందంటూ ఆయన చేసిన విజ్ఞప్తిపై గత ఆగస్టులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు స్పందించింది. రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రికెటర్‌గా ప్రస్థానం ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు. అనంతరం ఆయనపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. వాటిపై ఎపుడు విచారణ జరిగి దోషిగా తేలుస్తారా అనేది చూడాల్సింది.