SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జపాన్‌లో వింత స్లీపింగ్ కాంపిటీషన్.. 90 నిమిషాలు నిద్రపోతే లక్షల రూపాయల బహుమతి!

Japan Sleep Competition: జపాన్‌లో నిర్వహించిన వింత నిద్ర పోటీలు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌ సోషల్ మీడియాల్లో దీని గురించి వస్తున్న న్యూస్‌ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అసలు ఈ పోటీలు ఎందుకు? వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 02:32 PM IST | Updated: Nov 10, 2026, 02:36 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Japan Sleep Competition News: సాధారణంగా ఏదైనా పోటీలో గెలవాలంటే పరుగెత్తాలి.. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఏ పనీ చేయకుండా.. హాయిగా కంటినిండా నిద్రపోతే భారీగా డబ్బులు గిఫ్ట్‌ లభిస్తుందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.. జపాన్‌లో నిర్వహించిన నిద్ర పోటీలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఈ పోటీలో పాల్గొని గాఢంగా నిద్రపోయిన విజేతకు ఏకంగా రూ.12 లక్షల వరకు మనీ గిఫ్ట్‌ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది..

జపాన్ ప్రజల Work Cultureకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.. ఉదయం నుంచి రాత్రి వరకు అస్సలు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల చాలామంది నిద్రలేమి.. ఒత్తిడి సమస్యలతో బాధపడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. మానవ ఆరోగ్యంలో మంచి నిద్ర ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు అక్కడి నిర్వాహకులు ఈ ప్రత్యేక నిద్ర పోటీని ఏర్పాటు చేశారట.. ప్రస్తుత కాలంలో గాడ్జెట్లతో పాటు పని ఒత్తిళ్ల వల్ల మాయమవుతున్న కంటినిండా నిద్రను గుర్తుచేయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశమట..

ఈ పోటీలో పాల్గొనేవారు కేవలం ఎక్కువ గంటలు పడుకుంటే సరిపోదు.. వారు ఎంత వేగంగా నిద్రలోకి జారుకున్నారు? ఎంత ప్రశాంతంగా.. గాఢంగా నిద్రపోయారు? అనేది ప్రత్యేక వైద్య సాంకేతిక పరికరాల ద్వారా ట్రాక్ చేస్తారట.. హార్ట్‌ బీల్‌ రేటు, శరీర కదలికలు, శ్వాస వ్యవస్థలను విశ్లేషించి నిద్ర నాణ్యతను కొలుస్తారట.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అత్యంత ప్రశాంతంగా నిద్రపోతే.. వ్యక్తిని విజేతగా ప్రకటించి.. రూ. 12 లక్షల మనీని గిఫ్ట్‌గా అందిస్తారట...

ఈ పోటీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. నిద్రపోతే డబ్బులు ఇచ్చే ఇలాంటి పోటీలు మన దగ్గర కూడా నిర్వహిస్తే బాగుండు.. అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. అలాగే తీవ్రమైన ఒత్తిడిలో జీవిస్తున్న ప్రస్తుత సమాజానికి మంచి నిద్ర ఎంతో అవసరమనే సందేశాన్ని ఈ పోటీ ఎంతగానో చాలా మందిని ప్రభావితం చేశాయని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ పోటీలకు సంబంధించిన అనేక పోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES