• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!

ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!

Diwali Gift Goes Viral: దీపావళి సందర్భంగా ఒక ఉద్యోగికి కంపెనీ ఇచ్చిన గిఫ్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కంపెనీ సదరు ఉద్యోగికి స్వీటు బాక్సులతో పాటు ఫుల్ ఓల్డ్ మంక్ రమ్ బాటిల్‌ను ఇచ్చింది. అందకే ఈ ఫోటో ఇంతలా వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 03:18 PM IST|Updated: Nov 10, 2026, 03:19 PM IST
joinshare
ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

2

మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!

3

ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!

4

పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

5

జపాన్‌లో వింత స్లీపింగ్ కాంపిటీషన్.. 90 నిమిషాలు నిద్రపోతే లక్షల రూపాయల బహుమతి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Gift Goes Viral: దీపావళి వచ్చిందంటే చాలు.. కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న వ్యాపార సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఏదో ఒక బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.. సాధారణంగా చాలా కంపెనీలు డ్రై ఫ్రూట్స్‌తో పాటు స్వీట్ బాక్సులు, బోనస్ డబ్బులను అందిస్తుంటాయి. అయితే.. తాజాగా ఒక ఉద్యోగికి తన సంస్థ ఇచ్చిన దీపావళి కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పండుగ సంబరాల్లో స్వీట్లతో పాటు ఇచ్చిన ఆ ప్రత్యేక గిఫ్ట్‌ నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ ఉద్యోగి సంస్థ నుంచి అందుకున్న బహుమతులతో దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతూ వస్తోంది.. ఆ ఫొటోలో సదరు ఉద్యోగి పండుగ సమయంలో ఇచ్చే స్వీట్ బాక్సులు.. కొత్త దుస్తులతో పాటు చేతిలో ఒక ఫుల్ ఓల్డ్ మంక్ రమ్ బాటిల్‌ను గర్వంగా పట్టుకుని కనిపించడం మీరు చూడొచ్చు.. సాధారణంగా సంస్థలు ఇచ్చే బహుమతులకు పూర్తి భిన్నంగా.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఉద్యోగి అభిరుచికి తగ్గట్లుగా ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతూ వస్తోంది.. రెండు రోజుల్లోనే ఈ ఫోటోకు విపరీతమైన లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తూ వస్తున్నారు.. కంపెనీ బాస్ అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల మనసు తెలిసిన యాజమాన్యం.. అని ఒకరు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. మరికొందరు ది బెస్ట్ బోనస్‌ అని కూడా కామెంట్లు రాసుకొస్తున్నారు..

ఇక మరికొంతమంది.. మా ఆఫీస్‌లో కనీసం సోన్ పాపిడీ బాక్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు.. మీ కంపెనీలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా బ్రదర్? అంటూ నిరుద్యోగులు, ఇతర ఉద్యోగులు కామెంట్ల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. పండుగ సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి కాంబినేషన్ ఏముంటుంది!.. అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా పండుగ బోనస్‌లతో పాటు గిఫ్ట్స్‌లో ఉద్యోగుల్లో ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి కనిపించడం సహజం.. కానీ, ఉద్యోగుల మూడ్‌ను అర్థం చేసుకుని ఇచ్చినట్లుగా ఉన్న ఈ వెరైటీ గిఫ్ట్ మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by JEEJAJI -Raj Jain (@jeejaji)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News