SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టిబెట్‌లో భారీ భూ కంపం.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Tibet Massive Earthquake:టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 16 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి టిబెట్‌లో 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి టిబెట్‌లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు భవనాలు దెబ్బతిన్నాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 12:41 AM IST | Updated: Oct 23, 2026, 11:45 AM IST
Image Credit: Tibet Earth Quake (ZEE News Telugu/Source)
Join

Tibet Rescue Operations: చైనా ఆక్రమిత టిబెట్ ప్రాంతంలో సంభవించిన భూకంపంతో ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది. మొత్తంగా  విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్‌-2 అత్యవసర స్థితిని చైనా ప్రకటించింది. చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల 33 నిమిషాల సమయంలో ఉత్తర టిబెట్‌ను శక్తివంతమైన భూ ప్రకంపనలు వణికించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైనట్లు చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 3 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తర టిబెట్‌లోని నాగ్చు నగర పరిధిలో గల బాచెన్ కౌంటీలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఇది సంభవించడంతో ప్రకంపనల ప్రభావం తీవ్రంగా  ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం భూకంపం 18 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం సముద్ర మట్టానికి సగటున 4వేల 864 మీటర్ల ఎత్తులో ఉంది. 2024 జనవరి తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు.

ప్రధాన భూకంపం తర్వాత 5.0 నుంచి 5.2 తీవ్రతతో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఇటీవల టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల నుంచి ఆ ప్రాంతం ఇంకా తేరుకోకముందే ఈ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులో హిమానీనదం కూలిపోవడం వల్ల జరిగిన ఆ విపత్తులో 1,400 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. భారత, యురేషియా టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం వల్లే హిమాలయ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES