• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?

Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?

India vs New Zealand 2nd T20 Updates: న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ గాయంతో దూరమయ్యాడు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Written ByAshok Krindinti
Published: Oct 23, 2026, 12:46 PM IST|Updated: Oct 23, 2026, 12:57 PM IST
joinshare
Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?
Image Credit: India vs New Zealand 2nd T20 Updates (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అమ్మాయిల ముసుగు లో అబ్బాయి..  వలపు వలలో బొక్క బోర్ల పడ్డ 1000 మంది ఖాకీలు.. చివరికి ఏమైందంటే?

అమ్మాయిల ముసుగు లో అబ్బాయి.. వలపు వలలో బొక్క బోర్ల పడ్డ 1000 మంది ఖాకీలు.. చివరికి ఏమైందంటే?

2

టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

3

Anandiben Patel Comments: "ప్రియురాలిని తల్లిని చేసి వదిలేయోద్దు" ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!

4

Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.

5

Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs New Zealand 2nd T20 Updates: న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 మ్యాచ్‌లో సూపర్ విక్టరీతో జోరుమీదున్న టీమిండియాకు రెండో టీ20 మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కుడి కాలు కండరాల గాయంతో ఇబ్బంది పడినట్లు బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది.

ఇషాన్ కిషన్ గాయంపై బ్యాటింగ్‌ కోచ్ సితాన్షు కోటక్‌ అప్‌డేట్ ఇచ్చారు. ఇషాన్‌ కిషన్ గాయంతో బాధపడుతున్నాడని.. అందుకే తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడించామన్నారు. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చాడని వివరణ ఇచ్చారు. రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ ఆడట్లేదేని తెలిపారు. వెస్టిండీస్ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీని రెండో టీ20లో ఆడించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇషాన్‌ పరిస్థితిని వైద్యుల బృందం పరిశీలిస్తోందన్నారు. ఇషాన్ అందుబాటులో లేకపోతే.. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి వైభవ్ రెడీగా ఉన్నాడని అన్నారు.

ఇషాన్ కిషన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తే.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ రాణిస్తుండడంతో వైభవ్‌ వన్‌డౌన్‌లో ఆడించే అవకాశం ఉంది. అయితే గతంలో సంజుకు వన్‌డౌన్‌లో ఆడిన అనుభవం ఉండడంతో అభిషేక్-వైభవ్‌ను ఓపెనర్లుగా పంపించే ఆలోచన కూడా చేయొచ్చు. లేదంటే తిలక్ వర్మను మూడో స్థానంలోనే కొనసాగించి.. మిడిలార్డర్‌ను సర్దుబాటు చేస్తారా లేక ఓపెనింగ్ ఆర్డర్‌లో ఏమైనా మార్పులు చేస్తారా అనేది మ్యాచ్ సమయానికి తేలనుంది. మొదటి మ్యాచ్‌ జరిగిన క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగానే రేపు (శనివారం) రెండో మ్యాచ్‌ జరగనుంది.

తొలి టీ20 మ్మాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ 67 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (42).. ఆఖర్లో నమన్ ధీర్ (42 నాటౌట్) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.  

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News