• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.

Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.

Woman inmate barala in Rajamahendravaram: మహిళకు జైలు అధికారులు భారసాల నిర్వహించారు. అంతే కాకుండా ప్రత్యేకంగా జైల్లో గదిని కూడా కేటాయించి బారసాల నిర్వహించారు.

Written ByInamdar Paresh
Published: Oct 23, 2026, 12:58 PM IST|Updated: Oct 23, 2026, 01:04 PM IST
joinshare
Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.
Image Credit: Andhra pradesh (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అమ్మాయిల ముసుగు లో అబ్బాయి..  వలపు వలలో బొక్క బోర్ల పడ్డ 1000 మంది ఖాకీలు.. చివరికి ఏమైందంటే?

అమ్మాయిల ముసుగు లో అబ్బాయి.. వలపు వలలో బొక్క బోర్ల పడ్డ 1000 మంది ఖాకీలు.. చివరికి ఏమైందంటే?

2

టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

3

Anandiben Patel Comments: "ప్రియురాలిని తల్లిని చేసి వదిలేయోద్దు" ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!

4

Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.

5

Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Prison officials celebrate barasala in Rajamahendravaram jail: సమాజంలో ఇటీవల కొంత మందిలో నేర ప్రవృత్తి ఎక్కువైంది. కొంత మంది ప్రతి చిన్న విషయలు గొడవలు పడి పెద్దది చేసుకుంటున్నారు. వాగ్వాదాలు చేసుకుని, పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లి కేసుల్ని పెట్టుకుంటున్నారు.  మహిళలు సైతం ఇటీవల నేరాల్లో పురుషుల్ని దాటేస్తున్నారు. ముఖ్యంగా భర్తలను చంపుతున్న ఘటనల్లో  ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఏపీలో ఒక మహిళ జైల్లో ఉండగా డెలీవరీ అయ్యింది. దీంతో జైలు అధికారులు ఆమెకు ప్రత్యేకంగా గదిని కేటాయించారు.


ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్ర వరంలో  ఒక మహిళ ఖైదీ బిడ్డకు జైలు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బారసాల నిర్వహించారు. సదరు మహిళ సెప్టెంబర్ 25న రిమాండ్ పై రాజమహేంద్ర వరం జైలుకు వచ్చింది. అప్పటికే ఆమె తొమ్మిదినెలల నిండు గర్భిణి. దీంతో ఆమెకు జైలులో ప్రత్యేకంగా గదిని కేటాయించారు. ఇటీవల రాజమహేంద్ర వరం జీజీహెచ్ ఆస్పత్రిలో మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

చిన్నారి ఆరోగ్యంగా 3.2 కేజీల బరువు ఉంది. దీంతో జైలు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళలకు మిషన్ శక్తి, అంగన్ వాడి, పోషణ్ 2.0 పథకాల ద్వారా పౌష్టికాహరం అందజేస్తున్నారు. అంతే కాకుండా రాజమహేంద్ర వరం జైల్లో  మహిళల కూతురికి బారసాల కూడా నిర్వహించి అధికారులు గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ అధికారులు గొప్ప మనసుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News