SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video: భారీ భూకంపంతో వణికిపోయిన దేశం.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! 7.7 తీవ్రతతో విలయతాండవం, కూలిన భవనాలు!

పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ లాటిన్ దేశంలో ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనల వల్ల భవనాలు ధ్వంసమై, విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలంతా భయంతో రోడ్లపైకి పరిగెత్తిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written By Renuka Godugu
Published: Oct 10, 2026, 08:21 AM IST | Updated: Oct 10, 2026, 08:23 AM IST
Image Credit: Panama Powerful Earthquake Video:
Join

Panama Powerful Earthquake Video: మరోసారి భూకంపం విలయతాండవం సృష్టించింది. లాటిన్ దేశమైన పనామాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి మరియు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంప కేంద్రం 12.6 కిలోమీటర్ల వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన వల్ల జరిగిన ఆస్తి లేదా ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు. కానీ భూకంపం రాగానే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన లైవ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, రాజధానిలో వచ్చిన ప్రకంపనల కారణంగా ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పిటలోసా అరిబాకు నైరుతి దిశలో పది కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీయడంతో, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

భూకంప తీవ్రత కారణంగా ప్రజలతో పాటు ఆఫీసుల నుండి కూడా జనాలు బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా, తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా సంకోచిస్తున్నారు. కొలంబియాలో కూడా భూకంపం సంభవించి భవనాలు వంగినట్లు తెలుస్తోంది.
శుక్రవారం పనామాలో ఈ భూకంపం సంభవించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వీధుల్లో ప్రజలు భయంతో వణికిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడి టోకుమాన్ అంతర్జాతీయ విమానాశ్రయం సర్వీసులను రద్దు చేసింది. రాజధాని పనామా సిటీలో భద్రతా పరమైన నష్టాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్లపై రద్దీ పెరగడంతో మెట్రో సేవలను నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఇతర కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

 

 

ఈ భూకంప తరంగాలు దేశవ్యాప్తంగా వ్యాపించి అన్ని చోట్లా ప్రకంపనలను సృష్టించాయని వార్తా సంస్థలు తెలిపాయి. పనామా సిటీలో సుమారు 40 సెకన్ల పాటు భూమి కంపించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో ఉన్న హెరార ప్రామిస్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రకంపనలు ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికా హెచ్చరికల ప్రకారం, ప్రస్తుతానికి సునామీ ముప్పు తొలగిపోయింది. అయితే పనామా, కొలంబియా, కోస్టారికా, విక్టోరియా, మెక్సికో , ఈక్వెడార్ వంటి తీర ప్రాంత దేశాలకు ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES