• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

Snake Vs Scorpion Video: ఓ పాము తేలుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ఈ వీడియోలో తేలు ఆ పాము దాడి నుంచి తప్పించుకోవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 04:08 PM IST|Updated: Oct 26, 2026, 04:10 PM IST
joinshare
తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

2

తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

3

Arnab Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుఫాను..రైతులు, ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు!

4

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?

5

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Snake Vs Scorpion Video: భూమిపై ప్రకృతిలో జరిగే జీవరాశుల వింతకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాముల వీడియోను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని విషపూరితమైన పాములు, ఇతర జీవులపై దాడి చేస్తున్న సందర్భంలో తీసిన వీడియోలు కూడా వైరల్ అవుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటి అరుదైన ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది.. ప్రాణాంతక విషమున్న ఒక నల్ల తేలు.. పాము దాడికి సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

ఈ వైరల్ వీడియో వివరాల్లోకి వెళితే.. చీకట్లో ఇసుక నేలపై ఒక భారీ నల్ల తేలు తన కొండిని పైకెత్తి దాడి చేసేందుకు సిద్ధంగా ఉండడం మీరు ఈ వీడియోలో చూడోచ్చు.. అయితే, దానికి అతి సమీపంలోనే ఉన్న ఒక పాము ఏమాత్రం బెదరకుండా తేలు దగ్గరికి వెళ్లడం మీరు క్లియర్‌గా గమనించవచ్చు.. క్షణాల వ్యవధిలోనే పాము.. తేలుపైకి దూసుకెళ్లి.. దాన్ని చుట్టుముట్టేసేందుకు ప్రయత్నించడం మీరు చూడోచ్చు.. తేలు కూడా ఏమాత్రం తగ్గకుండా తన బలమైన పంజాలతో పామును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు.

రెండు విష జీవుల మధ్య జరిగిన ఈ ఘటన చూస్తున్న వారికి తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది.. పాము శరీర బలం.. తేలు పదునైన కొండితో దాడి చేసుకోవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ చిన్నపాటి వీడియో క్లిప్‌ను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ దాదాపు 90 లక్షలకు పైగా వీక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేలాది మంది లైకులు చేసిన్నట్లు తెలస్తోంది..

సాధారణంగా పాములు కీటకాలు.. చిన్న సరీసృపాలను వేటాడుతూ కనిపించడం మీరు చూస్తూ ఉంటారు.. అయితే, తేలు వంటి విషపు కొండి.. కలిగిన జీవులతో తలపడటం చాలా అరుదుగా చూస్తున్నామని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ప్రకృతిలో బలవంతుడిదే రాజ్యం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News