• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?

Revanth Talks with Fadnavis: తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో మొదటగా గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు 152 మీటర్ల ఎత్తు ఎందుకనే విషయాన్ని మహా సీఎంతో పాటు వాళ్ల అధికారులకు  ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటుకు మహారాష్ట్ర సీఎం ప్రతిపాదించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 04:11 PM IST|Updated: Oct 26, 2026, 04:28 PM IST
joinshare
తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?
Image Credit: Tummadihatti Movie (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

2

తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

3

Arnab Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుఫాను..రైతులు, ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు!

4

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?

5

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth Talks with Fadnavis: తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో మొదటగా గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు 152 మీటర్ల ఎత్తు ఎందుకనే విషయాన్ని మహా సీఎంతో పాటు వాళ్ల అధికారులకు  ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటుకు మహారాష్ట్ర సీఎం ప్రతిపాదించారు.

బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేశాక తదుపరి కార్యాచరణకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు. ముంబై సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు.

తాగునీటి అవసరాలకు చాలవు.. 
అయితే, ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఉత్తమ్.

తెలంగాణ - మహారాష్ట్ర మధ్య చారిత్రక సాంస్కృతిక బంధం.. 

తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దశాబ్దాల కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని వివరించారు. ఆదిలాబాద్ గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
Telugu News
National News