• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /సింహాల ముందే బైక్ రైడ్.. వైరల్ అవుతున్న వీడియో.. ఎక్కడ జరిగిందంటే?

సింహాల ముందే బైక్ రైడ్.. వైరల్ అవుతున్న వీడియో.. ఎక్కడ జరిగిందంటే?

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ, తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే.. ఎవరైన బయపడాల్సిందే.. రాత్రి సమయంలో ఎవరు లేని రోడ్డుపై ఏకంగా ఒక సింహాల గుంపు సంచారం చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం భయం లేకుండా.. వాటి పక్కనుంచే బైక్‌పై దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 13:22 IST|Updated: Nov 24, 2026, 13:24 IST
joinshare
సింహాల ముందే బైక్ రైడ్.. వైరల్ అవుతున్న వీడియో.. ఎక్కడ జరిగిందంటే?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ, తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే.. ఎవరైన బయపడాల్సిందే.. రాత్రి సమయంలో ఎవరు లేని రోడ్డుపై ఏకంగా ఒక సింహాల గుంపు సంచారం చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం భయం లేకుండా.. వాటి పక్కనుంచే బైక్‌పై దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియో రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని ఒక రోడ్డుపై తీసినట్లు కనిపించడం మీరు చూడొచ్చు.. ఆ బైక్ వెనుక వస్తున్న ఒక కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఈ వీడియోను రికార్డ్‌ చేశారట.. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఆరెంజ్ కలర్‌ షర్ట్‌ ధరించిన ఒక వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్లడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. వారు కొంతదూరం ముందుకు వెళ్లగానే.. రోడ్డు మధ్యలో, పక్కన ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పలు సింహాలు తిరుగుతూ ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

సింహాలను దూరం నుంచి చూస్తేనే ఎవరైనా భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ.. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉండడం మీరు గమనించవచ్చు.. కనీసం తన బైక్‌ స్పీడ్‌ను కూడా తగ్గించలేకుండా.. వెనక్కి తిరగకుండా ఆ సింహాల గుంపుకు అత్యంత దగ్గర నుంచి బైక్‌ను తీసుకెళ్లడం మీరు చూడొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సింహాలు కూడా బైక్ శబ్దానికి గానీ.. మనుషులను చూసి గానీ ఎలాంటి దాడి చేయకుండా.. వాటి దారిలో అవి వెళ్లిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ ఘటన ఆఫ్రికా జాంబియాలో జరిగినట్లు సమాచారం. సఫారీ నెస్ట్‌తో పాటు @wildfreelions ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌ అవ్వడం ప్రారంభమైంది.. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రహదారి కావడంతో అక్కడ వన్యప్రాణుల సంచారం సాధారణమని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఆ బైకర్లను చూసి సింహాలే ఆశ్చర్యపోయి ఉంటాయి.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Safari Nest (@safarinest)

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Telugu News