• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో భారీగా వీసాలు రద్దు.. వలసదారులకు బిగ్ షాక్..!!

ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో భారీగా వీసాలు రద్దు.. వలసదారులకు బిగ్ షాక్..!!

US Immigration Policy: అమెరికాలో ట్రంప్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలుపై ట్రంప్ యంత్రాంగం కఠిన ఆంక్షలు విధిస్తోంది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 3లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికన్ విదేశాంగశాఖ అధికారికంగా ధ్రువీకరించింది.

Written ByBhoomi
Published: Oct 21, 2026, 11:22 AM IST|Updated: Oct 21, 2026, 11:23 AM IST
joinshare
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో భారీగా వీసాలు రద్దు.. వలసదారులకు బిగ్ షాక్..!!
Image Credit: US Immigration Policy

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా  వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

2

కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

3

వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

4

యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

5

ప్రైవేట్ బడుల్లో 25శాతం ఫ్రీ సీట్లు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

US Immigration Policy: అమెరికాలో ట్రంప్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలుపై ట్రంప్ యంత్రాంగం కఠిన ఆంక్షలు విధిస్తోంది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 3లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికన్ విదేశాంగశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. సమాజ భద్రతకు విఘాతం కలిగించడం.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం.. ఇమ్మిగ్రేషన్, విజిటర్ రూల్స్ ను మోసపూరితంగా ఉల్లంఘించడం వంటి కారణాల వల్లే భారీ స్థాయిలో వీసాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

రద్దు చేసిన వీసాలలో దాదాపు 4,000 వీసాలు బర్త్ టూరిజంకు సంబంధించినవి కావడం గమనార్హం. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే అమెరికా పౌరసత్వం పొందాలనే ఉద్దేశ్యంతో ప్రయాణించడాన్ని బర్త్ టూరిజంగా పరిగణిస్తారు. ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించే లేదా వాటిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.

గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ పరిపాలనలో వీసా రద్దులు చాలా వేగంగా జరుగుతున్నాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ పిగాట్ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే, మోసానికి పాల్పడే, లేదా జాతీయ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వీసా రద్దుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 2026 నాటికి 1,75,000 వీసాలు రద్దు కాగా, సెప్టెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 2,50,000కు చేరుకుంది. ఆ సమయంలో 2,300 బర్త్ టూరిజం కేసులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 4,000కు పైగా పెరిగింది.

2026లో రద్దు ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే.. వీసాలు రద్దు చేసినవారి జాతీయతలను అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, ట్రంప్ పరిపాలన  కఠినమైన వలస విధానాలపై, ముఖ్యంగా వీసా రద్దు ప్రక్రియకు సరైన నియంత్రణ లేకపోవడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source