• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

Deer Chewing Snake Viral Video: ఒక జింక అత్యంత ప్రమాదకరమైన పామును నమిలి తింటున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. అసలు ఆ జింక పామును అలా ఎందుకు నమిలి తిన్నది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 21, 2026, 12:07 PM IST|Updated: Oct 21, 2026, 12:09 PM IST
joinshare
వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా  వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

2

కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

3

వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

4

యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

5

ప్రైవేట్ బడుల్లో 25శాతం ఫ్రీ సీట్లు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Deer Chewing Snake Video: సాధారణంగా జింక అనగానే పచ్చిక బయళ్లలో గడ్డిమేసే సాధజీవిగా చెప్పుకుంటూ ఉంటారు.. కానీ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒక జనావాసాల్లో ఉన్న జింక.. ఎలాంటి భయం లేకుండా అత్యంత విషపూరితమైన పామును నములుతూ కనిపిస్తున్న దృశ్యాలు అందర్నీ షాక్కు గురిచేస్తున్నాయి. జింకలు ఇలా కూడా చేస్తాయా అని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అసలు ఈ వీడియో ఎక్కడిది? జింక ఇలా పామును తినడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రికార్డ్ అయిన వీడియో వివరాల ప్రకారం.. ఈ వీడియోలో రికార్డు చేసిన వ్యక్తి ఆశ్చర్యంతో చూస్తుండగానే.. ఆ జింక ఎంతో సహజంగా పాములు నమిలి మింగేయడం మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. దీన్ని చూసిన చాలామంది శాకాహారి జీవి ఇలా పామును తినడమేంటి? ఆహారపు గొలుసు మారిపోయిందా? లేదా వాతావరణం మారుతున్న కొద్ది.. జీవులు కూడా ఇలా మారుతూ వస్తున్నాయా అంటూ.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

సైన్స్ ఏమి చెబుతోంది? 
వన్యప్రాణి శాస్త్రవేత్తల ప్రకారం.. జింకలు ప్రాథమికంగా శాకాహారులే అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవి మాంసాహారులుగా ప్రవర్తిస్తూ ఉంటాయని చెబుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో పోషకాల కోరత ఏర్పడడమేనని వన్య ప్రాణి సంరక్షకులు చెబుతూ వస్తున్నారు..

జింకల శరీరంలో ఎముకల తో పాటు కొమ్ములు వేగంగా పెరిగే సమయంలో లేదా గర్భాధారణ సమయంలో వాటికి క్యాల్షియంతో పాటు సోడియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అత్యధికంగా అవసరమవుతూ ఉంటాయి. పచ్చి గడ్డితోపాటు ఆకులలో ఈ ఖనిజాలు తగినంతగా లభించకపోవడంతో.. ఇవి ఎలుకలతో పాటు చిన్న చిన్న జీవుల అవశేషాలను తింటూ ఉంటాయి. ఇలా తినడాన్ని కూడా జీవశాస్త్రంలో క్లియర్‌గా వివరించారు..

జింకలు క్రూర జంతువులు లాగా.. ప్రత్యేకంగా వేటాడవు.. దారిలో చనిపోయి పడి ఉన్న జంతువులతో పాటు నేలపై కనిపించే పక్షుల గుడ్లు, చిన్నపిల్లలు లేదా గాయపడిన కదల్లేని స్థితిలో ఉన్న పాములు కనిపించినప్పుడు ఆ ఖనిజలోపాల కారణంగా వాటిని నమిలి తింటూ ఉంటాయి..  చనిపోయిన పాము శరీర భాగాలను లేదా రక్తనాళాలను నమలడం వల్ల పాము విషం జీర్ణకోశంలోకి వెళ్లిన నేరుగా రక్తంలో కలవకపోతే.. ఇలాంటి ప్రభావం చూపదని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by 𓅓 Oleyam Conras 𓆗 (@iz.gozc)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News