• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

Mother Dog Video: తాజాగా ఓ తల్లి కుక్కకు సంబంధించిన హృదయ విదారక ఘటన అందర్నీ బాగోద్వేగానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో మరణించిన కుక్క పిల్లలను ఆ తల్లి కుక్క తన కాళ్ల సహాయంతో పూడ్చి పెడుతున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూడొచ్చు. దీనిని చూసిన వారంతా కంటికి నీళ్లు తెచ్చుకుంటున్నారు.. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 21, 2026, 12:23 PM IST|Updated: Oct 21, 2026, 12:27 PM IST
joinshare
కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttar Pradesh: 9 రోజుల పాటు నవరాత్రి ఉపవాసం.. దసరా రోజున 12 ఏళ్ల బాలిక మృతి.. అసలు విషయం ఇదే.!.

Uttar Pradesh: 9 రోజుల పాటు నవరాత్రి ఉపవాసం.. దసరా రోజున 12 ఏళ్ల బాలిక మృతి.. అసలు విషయం ఇదే.!.

2

ఉద్యోగులు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ వరుసగా 3 రోజులు హాలిడేస్?

3

Uttar Pradesh: రెచ్చిపోయిన ఏనుగు.. ఇనుప గొలుసును తెంచుకుని మావటిపై దాడి.. షాకింగ్ వీడియో..

4

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ అద్భుతమైన నటన.. ఐదు విభిన్న షేడ్స్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్!

5

Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mother Dog Video: తల్లి ప్రేమ ఎంతో గొప్పదో.. అమ్మ అనే భావన ప్రాణికోటి మొత్తానికి ఎంతటి ప్రేమను అందిస్తుందో చాటి చెప్పే ఘటన తరచుగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇవాళ మానవులకే కాకుండా మూగజీవాలకు కూడా తమ సంతానం పట్ల ప్రేమానురాగాలతో పాటు లోతైన బంధం ఉంటాయని నిరూపించే హృదయ విదారక ఘటన ఒకటి తాజా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరణించిన తన చిన్నారి పిల్లను ఒక తల్లి కుక్క స్వయంగా పాతి పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగా కలిచివేసేలా చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఆ తల్లి కుక్క పడుతున్న ఆవేదన మాటల్లో వర్ణించలేనిది.. అప్పటికే ప్రాణాలు కోల్పోయి.. నేలపై పడి ఉన్న తమ పిల్లల వద్దకు చేరుకున్న ఆ కుక్క.. కాసేపు దిక్కుతోచని స్థితిలో వాటిని చూసింది.. ఆ తర్వాత మట్టి నేలను తన రెండు కాళ్ళతో నెమ్మదిగా గుంతలా తవ్వింది. ఆ తర్వాత ఒక పిల్లను నోటి సహాయంతో సున్నితంగా ఎత్తుకొని ఆ గుంతలు ఉంచడం మీరు క్లియర్ గా వీడియోలో చూడొచ్చు..

అక్కడితో ఆగకుండా తన ముక్కుతో పాటు కాళ్ల సహాయంతో చుట్టూ ఉన్న మట్టిని కప్పుతో ఆ చిన్నారి మృతదేహం పూడ్చి పెట్టడం మీరు క్లియర్ గా చూడొచ్చు. మూగజీవి అయినప్పటికీ.. తన పిల్లలకు ఒకరకంగా చివరి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించినట్లుగా ఉన్న ఈ దృశ్యం చూసే వారి ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తెప్పించేలా చేస్తుంది. ఆ సమయంలో దాని ముఖంలో కనిపించిన నిస్సహాయం.. చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోయేలా చేస్తుంది..

ఈ విషాదకర ఘటన ఎక్కడ.. ఎప్పుడు చోటు చేసుకుందో అనే వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ.. అంతేకాకుండా స్పష్టమైన ఆధారాలు ఇంకా లేనప్పటికీ.. వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డు స్థాయిల్లో షేర్ అవుతూ వస్తుంది.. భాష తెలియని మూగ ప్రాణాల ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఈ దృశ్యం నిరూపిస్తుంది అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. అంతేకాకుండా అమ్మ ప్రేమకు రూపంతో పాటు జాతితో సంబంధం లేదు అంటూ.. సోషల్ మీడియా వినియోగదారులు బాగోద్వేగంతో కామెంట్లలో రాసుకు వస్తున్నారు.. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తుంది..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Ashu Kankaria (@ashukankaria)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News