• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /మన దగ్గర ఉచితంగా దొరికే మామిడి ఆకులు అమెరికాలో ఇంత ఖరీదా?

మన దగ్గర ఉచితంగా దొరికే మామిడి ఆకులు అమెరికాలో ఇంత ఖరీదా?

4 Mango Leaves Cost 575 Rupees: అమెరికాలో ఓ వ్లాగర్‌ మామిడి ఆకులు కొనుగోలు చేసే సమయంలో పోస్ట్ చేసిన వీడియో విపరీంతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ యువతి మామిడి ఆకుల ధరలు చూసి షాక్‌ అయిపోయింది. అమెరికాలో కేవలం 4 ఆకుల ధర రూ.575గా విక్రయిస్తున్నారు..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 12:11 PM IST|Updated: Oct 15, 2026, 12:13 PM IST
joinshare
మన దగ్గర ఉచితంగా దొరికే మామిడి ఆకులు అమెరికాలో ఇంత ఖరీదా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

2

Pakistan School Roof Collapse: ఘోర ప్రమాదం.. స్కూల్ పైకప్పు కూలి 20 మంది చిన్నారులు మృతి!

3

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

4

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!

5

Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ముందు చివరి గంటన్నరలో ఏం జరిగింది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

4 Mango Leaves Cost 575 Rupees Viral News: భారల్‌లో పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే.. తప్పకుండా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.. మన ఊళ్లలో అయితే.. పెరట్లో ఉండే మామిడి చెట్టు నుంచో లేదా ఇరుగుపొరుగు వారిని అడిగో ఎలాగోలా ఫ్రీగా తెచ్చుకుంటూ ఉంటారు.. మార్కెట్‌కు వెళ్లినా.. పది లేదా ఇరవై రూపాయలకే మామిడి ఆకులు లభిస్తూ ఉంటాయి.. కానీ.. అదే ఆకులు అమెరికా లాంటి దేవాల్లో కొనాలంటే.. మాత్రం జేబులు గుల్ల కావాల్సిందే.. నవరాత్రి పూజల కోసం షాపింగ్‌కు వెళ్లిన ఓ భారత మహిళకు కేవలం నాలుగు మామిడి ఆకులకే ఏకంగా రూ.575 ధరకు విక్రయిస్తున్నారు.

అమెరికాలో ఉంటున్న స్వాతి అనే వ్లాగర్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సమీపంలోని స్టోర్‌కు వెళ్లింది.. అయితే, పూజా సామగ్రితో పాటు గుమ్మానికి కట్టేందుకు మామిడి ఆకులను కూడా అక్కడే వెతికిందట.. అక్కడ ఒక ప్యాకెట్‌లో కేవలం నాలుగు మాత్రమే.. మామిడి ఆకులు ఉన్నాయి.. అయితే, దానిపై ఉన్న ధరను చూసి.. ఆమె ఒక్కసారి ఆశ్చర్యానికి గురైన్నట్లు తెలుస్తోంది. ఆ ప్యాకెట్ ధర భారత కరెన్సీలో రూ. 575 పైగా ఉండడం చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.. 4 ఆకులకు అంత ధరను చూసి అవాక్కైన ఆమె.. ఈ విషయాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఊహించని స్థాయిలో వైరల్ అయ్యింది.

మన దేశంలో చాలా తేలికగా.. తక్కువ ఖర్చుతో లభించే వస్తువులు విదేశాల్లో ఎంత ఖరీదైనవిగా మారుతాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. స్వదేశాన్ని వదిలి వేరే దేశాల గడ్డపై స్థిరపడినప్పటికీ.. మన సంస్కృతి, ఆచారాలను కాపాడుకోవాలని తపించే ప్రవాస భారతీయులు ఇలాంటి వాటి కోసం అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం తప్పడం లేదు.. ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జిలతో పాటు, దిగుమతి టాక్సులు కలిపి చిన్నచిన్న పూజా సామగ్రికి కూడా అక్కడ భారీ డిమాండ్‌తో పాటు అంతకుమించిన ధరలు ఉంటున్నాయని ఆ మహిళ చెబుతూ వచ్చారు..

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. దీనిని చూసిన సోషల్ మీడియయా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..  మన ఊర్లో చెట్టు ఎక్కి కోసుకుంటే ఉచితం.. అక్కడ నాలుగు ఆకులకు రూ. 575 అంటే నమ్మలేకపోతున్నాం.. అని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి వెళ్లి మామిడి ఆకుల వ్యాపారం మొదలుపెడితే.. కోటీశ్వరులం అయిపోవచ్చు.. అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News