దుబాయ్‌లో ఏకంగా 16 కిలోల బంగారు జుమ్కాలు.. రెండు గిన్నిస్ రికార్డులు..!!
World Largest Earrings: దుబాయ్ నగరం స్వర్ణాభరణాల తయారీలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఆభరణాల తయారీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జాయ్ఆలుక్కాస్ ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఒక జత భారీ బంగారు జుమ్కాలు ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తమ సొంతం చేసుకున్నాయి.
World Largest Earrings: దుబాయ్ నగరం స్వర్ణాభరణాల తయారీలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఆభరణాల తయారీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జాయ్ఆలుక్కాస్ ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఒక జత భారీ బంగారు జుమ్కాలు ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తమ సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ బరువు కలిగినవిగా.. అలాగే అత్యంత భారీ పరిమాణంలో ఉన్న బంగారు చెవిపోగులుగా ఇవి సరికొత్త చరిత్రను లిఖించాయి. ఈ మైమరిపించే అరుదైన స్వర్ణాభరణాల ఆవిష్కరణ... ప్రదర్శన దుబాయ్ నగరంలో ఎంతో వేడుకగా.. కన్నులపండువగా నిర్వహించారు.
ఈ అద్భుత జుమ్కాలకు మయూర సహస్ర అని పేరు పెట్టారు. సంస్క్రుతంలో ఈ పదానికి వెయ్యి నెమళ్లు అని అర్థం వస్తుంది. పేరుకు తగ్గట్లుగానే నెమలి అందాలను స్పూర్తిగా తీసుకుని.. సంప్రదాయ దక్షిణాసియా జుమ్కా డిజైన్ లో వీటిని తీర్చిదిద్దారు. 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారంతో తయారు చేసిన ఈ జుమ్కాల జత బరువు 16.514 కిలోలు ఉన్నాయి. వీటి పొడవు 1.215 మీటర్లు ఉండగా.. వ్యాసం 0.682 మీటర్లు ఉంది. ఈ కొలతలు చూస్తేనే వీటి భారీతనం.. డిజైన్ లోని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
మయూర సహస్ర డిజైన్ అత్యద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి ఒక అద్భుతం. దీనిని రూపొందించడానికి 55 మంది నైపుణ్యం గల కళాకారులు నెలల తరబడి పగలు, రాత్రి శ్రమించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి మొత్తం 5,840 గంటల సమయం పట్టింది. భారతీయ ఆభరణాల తయారీ సంప్రదాయంలో ఆధునిక హస్తకళా నైపుణ్యం మేళవించేలా ప్రతి వివరమూ జాగ్రత్తగా రూపొందించింది.
ఈ పెద్ద చెవిపోగులను అక్టోబర్ 24న దుబాయ్‌లోని గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న 'జ్యూయల్ ఆఫ్ జాయ్' షోరూమ్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌహిద్ అల్ మర్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటిని ప్రజలకు ఆవిష్కరించడానికి ముందు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ చెవిపోగులను తనిఖీ చేసి, రెండు టైటిళ్లను అధికారికంగా ధృవీకరించారు. ఈ ఘనత, బంగారం వ్యాపారం మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా దుబాయ్‌కి ఉన్న హోదాకు నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి.
Also Read: