Abhijeet Dipke Arrested Live Update: ఢిల్లీ కాక్రోచ్ నిరసనలు.. విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్ట్..
Delhi jantar mantra protest: దేశ రాజధాని ఢిల్లీలో వేలాదిగా భద్రత బలగాలను మోహరించారు. ఎక్కడకూడా శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ కాక్రోచ్ లను అదుపులోకి తీసుకున్నారు.
Delhi Jantar mantar protest Row: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకొగానే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈక్రమంలో విమానాశ్రమయంలో ఉద్రిక్తత నెలకొంది.
ఢిల్లీ విమానాశ్రయంలో అభిజీత్ దీప్కేతో పాటు, సౌరవ్ దాస్, అశితోశ్ రంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 500ల మంది నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ దీప్కే అరెస్ట్ తో ఉద్రిక్తత నెలకొంది.
Delhi CJP Protest news: ఢిల్లీ పోలీసులపై కాక్రోచ్ నిరసన కారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతనెలకొంది. కన్నాట్ ప్లేస్, ఆకాశవాణి భవన్ వద్ద రాళ్లు రువ్విన ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు ఈ ఘటనలో గాయపడ్డారు. మరోవైపు నిరసన కారులను అదుపులోకి తీసుకున్న వాహనాలు ముందుకు కదలకుండా కాక్రోచ్ లు అడ్డుకున్నారు.
CJP Protest In Delhi: కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కాక్రోచ్ నిరసన కారులు బారికెడ్లను తోసుకుంటూ పోలీసులతో వాగ్వాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. మరోవైపు బలగాలు నిరసన కారులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలిస్తున్నారు.
10 Oct 2026, 12:14 PM
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గృహ నిర్బంధం..
CJP Party Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు దీనిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పాలన కంటే దారుణంగా ఉందని కేేంద్రంపై విమర్శలు గుప్పించారు.
10 Oct 2026, 12:10 PM
కాక్రోచ్ జనతా పార్టీ లీగర్ హెడ్ తో పాటు పలువురు గృహనిర్బంధం..
CJP Delhi Jantar Mantar Protest: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ ను పోలీసులు ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పాటు సీజేపీ న్యాయవిభాగం హెడ్ రత్నా సింగ్‌లను వారి ఇళ్ల వద్దే గృహనిర్బంధం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.