/CJP Delhi Protest Live update: పోలీసుల భద్రత వలయంలో ఢిల్లీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివాదంపై కొనసాగుతున్న హైటెన్షన్..
Live Now
CJP Delhi Protest Live update: పోలీసుల భద్రత వలయంలో ఢిల్లీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివాదంపై కొనసాగుతున్న హైటెన్షన్..
Delhi Jantar mantar cjp protest update: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన జంతర్ మంతర్ నిరసలతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు బలగాలను మోహరించారు.
Delhi CJP Protest: పోలీసులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ లను అడ్డుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 150 మంద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. ఐడీ కార్టులు గమనించిన తర్వాత ఇతరులను పోలీసులు జంతర్ మంతర్ వద్ద అనుమతిస్తున్నారు.
#WATCH | Delhi: Heavy deployment of security forces at Dhaula Kuan ahead of the protest called by the Cockroach Janta Party (CJP) at Jantar Mantar. https://t.co/JUrZQMkeZZ
CJP Protest In Delhi Jantar Mantar: దేశ రాజధానిలో కనివినీ ఎరుగని విధంగా భద్రత చేపట్టారు. ముఖ్యంగా జంతర్ మంతర్, జన్ పథ్, ఎన్నికల సంఘం ఆఫీస్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరిసరాల్లోని 1.5 కిలోమీటర్ల పరిధిని అత్యంత సున్నితమైన జోన్‌గా ప్రకటించారు.
#WATCH | Delhi Police detain a few protesters from Sansad Marg area, ahead of Cockroach Janta Party (CJP) protest today. https://t.co/0QRiO2Ho0V
ఏడు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, న్యూఢిల్లీ పలు జోన్లుగా విభజించి డ్రోన్లు, కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టారు. ఎక్కడికక్కడ కాక్రోచ్ లను అదుపులోకి తీసుకుంటున్నారు.
10 Oct 2026 08:55 IST (IST)
ఢిల్లీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల ఫ్లాగ్ మార్చ్ ..
CEC Delhi Protest: ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించాయి. అంతేకాకుండా పలు చోట్ల రోడ్లపై ఇనుప చువ్వలను సైతం ఏర్పాటు చేశారు.
#WATCH | Delhi: RAF (Rapid Action Force) personnel carry out a flag march from Mandi House Circle, ahead of Cockroach Janta Party (CJP) protest today. https://t.co/sdO5740o9f
Delhi CJP Protest update: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ కు బయలు దేరారు. పోలీసులు ఢిల్లీలో కఠిన ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం యువతను చూసి భయపడుతోందా?.. అంటూ ప్రశ్నించారు.
రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయాల్సిన అవసరమేంటని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపుపై ప్రశ్నలు సంధించారు. నిరసనల్లో పాల్గొనకుండా ప్రజలను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. శాంతియుత నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు.
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Delhi cjp protest against cec at jantar mantar Live update: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు, ఇండియా కూటమి సైతం జంతర్ మంతర్ వద్ద ఈ రోజు నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి దేశ వ్యాప్తంగా కాక్రోచ్ లు రావాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీలో కఠిన ఆంక్షలు విధించారు. జన్‌పథ్-కర్తవ్య పథ్ కూడలి పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 24 గంటల పాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023లోని నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని పోలీసులు ఆయా మొబైల్ నెట్ వర్క్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.