IND vs WI Live Updates: ఉప్పల్‌లో సెంచరీ బాదిన హోప్.. భారత్‌కు 248 లక్ష్యం విధించిన విండీస్
India vs West Indies 4th T20I Live Updates: పరుగుల వరద పారే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో భారత్ బరిలో దిగింది. టీ20 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్‌లో విండీస్‌తో భారత్ తాడేపేడో తేల్చుకోనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది.
India vs West Indies 4th T20I Live Updates: ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో హైదరాబాద్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్ జరుగుతోంది. 2-1 ఆధిక్యంతో ఉన్న భారత్ ఉప్పల్ స్టేడియం వేదికగా విండీస్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ను నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలో దిగుతోంది. ఉప్పల్‌లో ఊచకోత కోసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని సిరీస్ సమం చేయాలని కరీబియన్ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్ నమోదు చేసేందుకు బరిలో దిగారు. అశేషంగా పాల్గొన్న హైదరాబాద్ ప్రేక్షకుల మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ వేయగా.. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగనుంది. మరి అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోండి.
14 Oct 2026, 8:43 PM
Hope Century: హోప్ సెంచరీ.. భారత్ లక్ష్యం 248
ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదకు భారత జట్టు బ్రేక్ వేసింది. మొదట దూకుడుగా ఆడిన వెస్టిండీస్ ఆటగాళ్లు తర్వాత పరుగులు సాధించడంలో తడబడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 247 పరుగులు చేసింది. గొప్పగా పోరాడిన విధ్వంసకర బ్యాటర్ హోప్ సెంచరీ నమోదుచేసి పలు రికార్డులు నమోదు చేశాడు. వికెట్ల కోసం వేట సాగించిన భారత బౌలర్లకు నిరాశ ఎదురైంది. మూడు వికెట్లతోనే భారత బౌలర్లు సరిపెట్టుకున్నారు. దూకుడుగా ఆడిన విండీస్ భారత్‌కు 248 లక్ష్యం విధించింది.
14 Oct 2026, 8:41 PM
IND vs WI Live: విండీస్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలం
250 మార్క్ దిశగా పోరాడుతున్న వెస్టిండీస్ బ్యాటర్లు. 19వ ఓవర్ పూర్తయిన తర్వాత మూడు వికెట్ల నష్టానికి విండీస్ 228 పరుగులు నమోదు చేసింది. విండీస్ ఆటగాళ్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోర్ నమోదైంది.
14 Oct 2026, 8:36 PM
India Bowling: వికెట్ కోసం శ్రమిస్తున్న భారత బౌలర్లు
18 ఓవర్లు పూర్తి చేసుకున్న అనంతరం వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. క్రీజులో హోప్ సెంచరీ దిశగా ఆడుతుండగా.. రూథర్‌ఫోర్డ్ కూడా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. చివరి ఓవర్లలో కూడా భారత బౌలర్లు విండీస్‌ను దెబ్బతీయడం లేదు. వికెట్ కోసం బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
14 Oct 2026, 8:29 PM
WI Crosse 200 Score At Uppal: 200 మైలురాయి దాటిన విండీస్
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా నిలిచే ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ భారీ పరుగుల దిశగా దూసుకెళ్తోంది. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 200 పరుగుల మైలురాయి దాటింది. హోప్, రూథర్‌ఫోర్డ్ కలిసి భారత బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. భారత బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించేలా విండీస్ ఆట కొనసాగుతోంది. 17 ఓవర్లు పూర్తయ్యాక మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ 207 పరుగులు చేసింది.
14 Oct 2026, 8:23 PM
16 ఓవర్లు.. 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు
హోప్ భారీ ఇన్నింగ్స్‌కు 16 ఓవర్లు పూర్తయిన తర్వాత వెస్టిండీస్ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. హోప్ (78) సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. అతడికి రూథర్‌ఫోర్డ్ (15) చక్కటి భాగస్వామ్యం కల్పిస్తూనే స్కోర్ బోర్డు పరుగెత్తేలా చేస్తున్నాడు.
14 Oct 2026, 8:21 PM
Hope Record Innings: ఉప్పల్ స్టేడియంలో హోప్ ఊచకోత
15 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన శాయ్ హోప్ ఉప్పల్ స్టేడియంలో ఊచకోత కోస్తున్నాడు. 40 బంతులకు 76 పరుగులు చేయగా.. రూథర్ ఫోర్డ్ 8 పరుగులతో ఉన్నాడు.
14 Oct 2026, 8:16 PM
India vs West Indies: భారత్ పై వెస్టిండీస్ భారీ స్కోర్
ఉప్పల్ స్టేడియంలో వికెట్లు కోల్పోతున్నా కూడా వెస్టిండీస్ భారీ స్కోర్ సాధిస్తోంది. హోప్, రూథర్‌ఫోర్డ్ మైదానంలో పోరాడుతుంగా.. 14 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన విండీస్ 168 పరుగులు చేసింది.
14 Oct 2026, 8:11 PM
Powell Out: పావెల్ ఔట్.. హోప్ భారీ పోరాటం
అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత హోప్ దంచి కొడుతున్నాడు. పావెల్‌తో కలిసి దూకుడుగా ఆడుతుండడంతో 13 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 156 పరుగులు చేసింది. మూడు ఓవర్లలోనే భారీగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఒక వికెట్ తీశాడు.
14 Oct 2026, 8:03 PM
150 పరుగులు దాటిన వెస్టిండీస్
12 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 150 పరుగుల మార్క్‌ను దాటింది. హోప్ దూకుడు ఆటకు పావెల్ చక్కగా సహకరిస్తూ ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కూడా విండీస్ ఆటగాళ్లు దంచికొట్టారు. ఫలితంగా 12 ఓవర్లు పూర్తయ్యాక 152 పరుగులు పూర్తి చేసుకుంది.
14 Oct 2026, 8:00 PM
Hope Half Century: హోప్ అర్ధ సెంచరీ
విరామం వెస్టిండీస్ ఆటగాళ్లు దూకుడు పెంచి 11వ ఓవర్లో 11 పరుగులు రాబట్టారు. 28 బంతుల్లో హోప్ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. పావెల్‌తో కలిసి హోప్ భారీ ఇన్నింగ్స్ దిశగా ఆడుతున్నాడు.
14 Oct 2026, 7:52 PM
IND vs WI Live Updates: అక్షర్ అద్భుత బౌలింగ్.. ఒత్తిడిలో విండీస్
10వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ వెస్టిండీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వికెట్ కోల్పోయిన అనంతరం హోప్, పావెల్ పొదుపుగా ఆడారు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపించేందుకు జంకారు. 10 ఓవర్లు పూర్తయిన తర్వాత వెస్టిండీస్ స్కోర్ 118/2.
14 Oct 2026, 7:47 PM
భారత్‌కు ఊరట.. హెట్మెయిర్ ఔట్
ఉప్పల్ స్టేడియంలో దూకుడుగా ఆడుతున్న వెస్టిండీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల వరద పారిస్తున్న విధ్వంసకర బ్యాటర్లు హోప్, హెట్మెయిర్ జోడీకి మయాంక్ అగర్వాల్ బ్రేక్ వేశాడు. 9వ ఓవర్ రెండో బంతి వేసిన మయాంక్ హెట్మెయిర్ బాదిన షాట్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టి వెనక్కి పంపించాడు. 12 బంతుల్లో 33 పరుగులు చేసి హెట్మెయిర్ వెనుదిరిగాడు. 9 ఓవర్లు పూర్తయ్యాక వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
14 Oct 2026, 7:43 PM
IND vs WI Live.. సెంచరీ మార్క్ దాటిన వెస్టిండీస్
ఏడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ కూడా భారీగా సమర్పించుకున్నాడు. హోప్, హెట్మెయిర్ కలిసి 21 పరుగులు రాబట్టారు. ఉప్పల్ స్టేడియంలో విండీస్ భారీగా పరుగులు సాధిస్తూ భారత్‌కు చుక్కలు చూపిస్తున్నారు. విండీస్ బ్యాటర్ల దూకుడుకు భారత బౌలర్లు తేలిపోతున్నారు.
14 Oct 2026, 7:35 PM
IND vs WI Live Updates: ఆరు ఓవర్లకు విండీస్ స్కోర్ 79/1
ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారుతోంది. భారత్ బౌలింగ్‌ను చక్కగా వినియోగించుకుని భారీ పరుగుల దిశగా విండీస్ ఆడుతోంది. అర్ష్‌దీప్ సింగ్ మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆరో ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి.
14 Oct 2026, 7:27 PM
IND vs WI Live Updates: తొలి వికెట్ కోల్పోయిన విండీస్
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు ఓవర్లు ముగిసిన అనంతరం బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ బంతితో మాయ చేసి జెవెల్ ఆండ్రే (21)ను ఔట్ చేశాడు. హోప్‌తో కలిసి హెట్మెయిర్ క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లు ముగిసేరికి వెస్టిండీస్ స్కోర్ 60/1.
14 Oct 2026, 7:23 PM
IND vs WI Live: చితక్కొడుతున్న విండీస్
IND vs WI 4th T20I Live Updates...
హైదరాబాద్ గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు దంచికొడుతున్నారు. నాలుగు ఓవర్లు పూర్తవగానే అర్ధ శతకాన్ని పూర్తి చేసింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఓపెనర్లు హోప్ (20), ఆండ్రే (21) చితక్కొడుతున్నారు. వికెట్ కోసం భారత బౌలర్లు కష్టపడుతున్నారు.
14 Oct 2026, 7:17 PM
IND vs WI Live: 20 పరుగులు రాబట్టిన కరీబియన్లు
IND vs WI Live Updates:
మూడో ఓవర్ మయాంక్ అగర్వాల్ వేయగా.. విండీస్ ప్లేయర్లు దూకుడుగా ఆడి 20 పరుగులు రాబట్టారు. ఓపెనర్లుగా దిగిన హోప్, ఆండ్రే దంచికొడుతున్నారు. మూడు ఓవర్లు ముగిశాక విండీస్ స్కోర్ 40/0
14 Oct 2026, 7:11 PM
IND vs WI 4th T20I Live: పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్
IND vs WI Live Updates... రెండో ఓవర్‌కు భారీగా పరుగులు చేసిన కరీబియన్లు. అర్షదీప్ దీప్ సింగ్ బౌలింగ్‌లో ఆండ్రే చితకబాదాడు. ఒక ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా రెండో ఓవర్ ముగిసేసరికి వెస్టిండీస్ స్కోర్ 20/0 పరుగులకు చేరింది.
14 Oct 2026, 7:05 PM
IND vs WI Live Updates: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్
బ్యాటింగ్ షురూ.. IND vs WI Live Updates: సిరీస్‌ను సమం చేయాలనే కసితో కరీబియన్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగగా.. శాయ్ హోప్, జెవెల్ ఆండ్రే ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. భారత్ తరఫున మయాంక్ అగర్వాల్ తొలి ఓవర్ వేశాడు. తొలి ఓవర్ పూర్తి చేసేసరికి 3 పరుగులు చేశారు.
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.