ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగని వారు ఉంటారు. చికెన్‌తో రకరకాల వంటకాలు తక్కువ సమయంలోనే వండుకోవచ్చు. చికెన్ ఆరోగ్యకరం, సాధారణంగా దీని ధర కూడా అందుబాటులో ఉంటుంది. అయితే చికెన్ ప్రియులకు ఒక షాకింగ్ విషయం చెప్పాలంటే, చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉన్నప్పటికీ, అందులోని ఒక భాగాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా చికెన్‌కు మంచి పేరు ఉంది; స్పైసీ కూరలు, గ్రిల్ చికెన్, బిర్యానీ వంటివి తయారు చేసుకోవచ్చు.
చాలామందికి చికెన్ వింగ్స్, బ్రెస్ట్, లాలిపాప్స్ వంటి వివిధ రకాలు ఇష్టమై ఉంటాయి. ఒక్కో పార్ట్ ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఇవి పోషకాలతో కూడి ఉంటాయి. కానీ చికెన్‌లో ఒక భాగం మాత్రం పొరపాటున కూడా తినకూడదు.
చికెన్ స్కిన్ విషయంలో చెప్పాలంటే, అది విషపూరితమైన భాగం కాదు కానీ అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కూడా అందులో చేరుతుంది, తద్వారా క్యాలరీలు మరియు ఫ్యాట్ కంటెంట్ పెరుగుతాయి. క్యాలరీలు తక్కువగా తీసుకోవాలనుకునే వారు లేదా డైట్ చేసేవారు చికెన్ స్కిన్‌ను తినరు. ప్రతిసారి చికెన్ స్కిన్‌ను తీసేయాల్సిన అవసరం లేదు, పోర్షన్ సైజును నియంత్రించుకునే వారు తినవచ్చు.
అయితే చికెన్ స్కిన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. స్కిన్ లేని చికెన్ బ్రెస్ట్ తినడం ఆరోగ్యకరం. కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, కార్డియో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చికెన్ స్కిన్‌తో పాటు డీప్ ఫ్రై చేసి, సాస్‌లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు కలిపి తీసుకుంటే అది మరింత ప్రమాదకరం అవుతుంది. కొద్ది మొత్తంలో వేయించిన చికెన్ తీసుకోవచ్చు కానీ, డీప్ ఫ్రై చేయడం హానికరం.
కొంతమందికి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం. చికెన్ స్కిన్ లా కాకుండా, లివర్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అయితే చికెన్ లివర్‌ను పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇందులో ఐరన్, విటమిన్ B12, A వంటి పోషకాలు ఉన్నప్పటికీ, ప్రతిసారి లివర్ తినడం అనారోగ్యకరం. ఇవే కాకుండా, కోడి కాళ్లు లేదా మెడ భాగం తినే వారు కూడా ఉంటారు. పచ్చి లేదా సరిగ్గా ఉడకని చికెన్‌లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. సరిగ్గా కట్ చేయకపోయినా లేదా కటింగ్ బోర్డ్, కిచెన్ ఉపరితలంపై ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఇలాంటి భాగాల కంటే కేవలం చికెన్ బ్రెస్ట్ తీసుకోవడమే మంచిది. చికెన్ ముట్టుకున్న తర్వాత చేతులను, సింక్ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా కడుక్కోవాలి, తద్వారా బ్యాక్టీరియా వ్యాపించకుండా చూసుకోవచ్చు. చికెన్‌ను అతిగా కడగకూడదని కూడా కొందరు చెబుతుంటారు.