SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్..

Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 23, 2026, 01:24 PM IST | Updated: Sep 23, 2026, 03:59 PM IST
Image Credit: AP Telangana Rains
Join

Heavy Rains In Two Telugu States: వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయన్నాయి. దీంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉద్యాయవన  పంటలు పండించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.వాయుగుండం తీరం దాటే సమయంలో బలమైన గాలులు, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతిభారీ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు పొటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖ–కొత్తవలస–కిరండోల్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రేపు, ఎల్లుండి నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు రైల్వే శాఖ తాజా సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రయాణాలు చేసుకోవాలని సూచించారు.

23 Sep 2026, 3:22 PM

రాగల 48 గంటల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షం..

తెలంగాణలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ తూర్పు భాగంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.  24.09.26. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు. తెలంగాణ ఉత్తర,  తూర్పు భాగంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. 25.09.26. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.  ఉత్తర తెలంగాణ, ఈశాన్య భాగంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.  ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్  ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. తెలంగాణ ఉత్తర మరియు తూర్పు భాగంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

23 Sep 2026, 3:09 PM

శ్రీకాకుళం తీరానికి సమీపంలో తీవ్రవాయుగుండం..!

శ్రీకాకుళం కళింగపట్నం తీరానికి సమీపంగా బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది.

ఈ వ్యవస్థ ఈరోజు రాత్రి విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య.. కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తీర ప్రాంతంలో ఈదురు గాలులు కొనసాగుతున్నాయి.

ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

23 Sep 2026, 2:49 PM

నైరుతి ఋతుపవనాల ప్రభావం..

ఈరోజు, 23 సెప్టెంబర్ 2026న నైరుతి రుతుపవనాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలోని చాలా ప్రాంతాలు, పూర్తి ఢిల్లీ, మరియు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలోని కొన్ని ప్రాంతాల నుండి మరింతగా ఉపసంహరించబడ్డాయి.

 పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం, పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా (Deep Depression) బలపడి, నిన్న (22 సెప్టెంబర్ 2026) సాయంత్రం 1730 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.  ఈ తీవ్ర వాయుగుండం గత 06 గంటలలో గంటకు 05 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణించి, ఈరోజు (23 సెప్టెంబర్ 2026) ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో 18.0°N అక్షాంశం మరియు 84.6°E రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్) కు ఆగ్నేయంగా 60 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు-ఈశాన్యంగా 140 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా) కు దక్షిణంగా 150 కి.మీ., మరియు పూరీ (ఒడిశా) కు దక్షిణ-నైరుతిగా 240 కి.మీ. దూరంలో ఉంది. ఇది మరింత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, ఈరోజు (23 సెప్టెంబర్ 2026) రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలను విశాఖపట్నం మరియు గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నంకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా దాటే అవకాశం ఉంది.

పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం కేంద్రం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మరియు కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి (Trough) బలహీనపడింది.

వాతావరణ సూచన (FORECAST)

ఈరోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

హెచ్చరికలు (WARNINGS) :

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని తూర్పు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర మరియు మధ్య జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

*రేపు  రాష్ట్రంలోని కొన్ని తూర్పు, ఈశాన్య జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం
మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉంది.మిగిలిన ఉత్తర జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది .*

ఈరోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 45 నుండి 55 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన   కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

23 Sep 2026, 2:47 PM

విశాఖ కైలాసపురంలో కొండ చరియలు విరిగిపడిన ఘటన..

కైలాసపురం కస్తూరి నగర్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలోని కైలాసపురం కస్తూరి నగర్‌లో ఈరోజు కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, ఆర్డీవో గీత సంగీత్ మాధురి గారు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అక్కడ నివసిస్తున్న ప్రజల భద్రతపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాలు మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము గారు, ఎమ్మార్వో ప్రసాద్ గారు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు కొండ ప్రసాద్, దానేష్, పైడికొండ తదితరులు పాల్గొన్నారు.

23 Sep 2026, 1:55 PM

విశాఖ శాతవాహన విశ్వవిద్యాలయ వసతి గృహంలో సమస్యలు..

భారీ వర్షాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని శాతవాహన వసతి గృహంలో సమస్యలు తలెత్తాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహంలోని గదుల పైకప్పుల నుంచి వర్షపు నీరు లీకవుతూ గదులన్నీ కారిపోతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఏయూ మెయిన్ గేట్ వద్ద నిరసనకు దిగారు.

వర్షం పడుతున్న సమయంలో గదుల్లోకి నీరు వస్తుండటంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గదుల్లో ఉండే పరిస్థితి లేకుండా పోతోందని, వర్షపు నీరు గదుల్లోకి చేరడంతో తమ పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి తడిసిపోతున్నాయని తెలిపారు.

వసతి గృహం భవనం నిర్వహణపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల బైఠాయింపు
 

23 Sep 2026, 1:51 PM

తూర్పుగోదావరి

అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా మోస్తారు వర్షం

రాజమండ్రి నగరంలో 
55 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ

- హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు

23 Sep 2026, 1:33 PM

విశాఖపట్నంలో ఎగిసిపడుతున్న అలలు..

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విశాఖ సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకి 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈరోజు రాత్రికి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీవ్రవాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేటకు వెళ్లిన మత్స్య కాలనీ తిరిగి తీరాలకు చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పలుపోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES