SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Telugu News Live Updates: టాలీవుడ్ ఇండస్ట్రీకి కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. నంది అవార్డులపై కీలక ప్రకటన

Today Telugu News Live: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, పొలిటికల్ మూమెంట్స్, స్పోర్ట్స్, సినిమా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

Written By Ashok Krindinti
Published: Sep 22, 2026, 03:09 PM IST | Updated: Sep 22, 2026, 03:25 PM IST
Image Credit: Today Telugu News
Join

Today Telugu News Live: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను తిరిగి ప్రారంభించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్‌లో అవార్డులను ప్రకటిస్తామన్నారు. ఇక ఆసియా గేమ్స్ 2026 విజేతగా భారత మహిళల క్రికెట్ జట్టు నిలిచింది. గోల్డ్ మెడల్ కోసం జరిగిన ఫైనల్ పోరులో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించింది. మరోవైపు జపాన్‌తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆల్మట్టి-నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల కోసం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్లారు. లేటెస్ట్ తెలుగు న్యూస్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

22 Sep 2026, 3:25 PM

ఇంచార్జ్ హెడ్‌మాస్టర్ ఆత్మహత్యాయత్నం..

Today Telugu News Live Updates: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిలువ కోడూరులో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఇంచార్జ్ హెడ్‌మాస్టర్ ప్రశాంత్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పై అధికారుల ఒత్తిడి, అదేవిధంగా పాఠశాలలో సిబ్బంది లేకున్నా విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. 

22 Sep 2026, 3:23 PM

ఫామ్ హౌస్‌లకు నేను వ్యతిరేకం

Today Telugu News Live Updates: నల్గొండలో  మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. "నాకు ఫామ్ హౌస్ లేదు.. ఫామ్ హౌస్‌లకు నేను వ్యతిరేకం. రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలి తప్ప వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకోవడం కాదు. BRS నేతలు అక్రమంగా సంపాదించిన ఫామ్ హౌస్‌ల లెక్కలు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తీస్తున్నారు.." అని చెప్పారు. 

22 Sep 2026, 3:21 PM

CURE బిల్లుకు ఆమోదం

Today Telugu News Live Updates: 'కోర్ అర్బన్ రీజియన్ −2026' (CURE) బిల్లుకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. దీంతో 70 ఏళ్ల నాటి GHMC-1955 చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఒకే నగరం, ఒకే పాలన లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధులను ఒక్కటి చేశారు. అలాగే పాత అద్దె విధానం స్థానంలో మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధించనున్నారు. 375 చదరపు అడుగులలోపు ఉన్న చిన్న ఇళ్లకు ఏటా రూ.101 పన్ను వసూలు చేయనున్నారు.

22 Sep 2026, 3:15 PM

నారా లోకేష్ వార్నింగ్

Today Telugu News Live Updates: మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. టీచర్ల జోలికి వస్తే దబిడి దిబిడే అంటూ బాలయ్య స్లైల్లో హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాడు చేసిన ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES