SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: 9 రోజుల పాటు నవరాత్రి ఉపవాసం.. దసరా రోజున 12 ఏళ్ల బాలిక మృతి.. అసలు విషయం ఇదే.!.

12 Years girl dies in kasganj: 12 ఏళ్ల బాలిక జాతరలో చావ్మీన్, ఐస్ క్రీమ్ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. ఉత్తర ప్రదేశ్ లో దసరా వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 21, 2026, 02:00 PM IST | Updated: Oct 21, 2026, 02:07 PM IST
Image Credit: up 12 year girl dies tragedy
Join

12 Years girl dies in kasganj uttar Pradesh: దేవీ శరన్నవరాత్రులను భక్తులు అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నవరాత్రుల్లో తొమ్మిది  రోజులు తొమ్మిది అవతారాల్లో దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చాలా మంద  ఈరోజుల్లో ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే.. యూపీలోని కాస్ గంజ్ లో 12 ఏళ్ల బాలిక నవరాత్రులు ఉపవాసం తర్వాత దసరా పండగ రోజున ఉపవాసంను విరమించుకుంది. ఆ తర్వాత ఆలయంలో వెళ్లింది.  ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.


ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో తీవ్ర విషాదం సంభవించింది. ఎటా జిల్లాలోని మిర్హాచి పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని తను శ్రీవాస్తవ నవరాత్రులలో 9 రోజుల పాటు భక్తితో అమ్మవారికి ఉపవాసం చేసింది. ఇక దసరా రోజున తన కుటుంబంతో కలిసి కాస్‌గంజ్‌లోని మా చాముండా దేవి ఆలయాన్ని సందర్శించింది. అమ్మవారికి ప్రార్థనలు చేసిన తర్వాత.. ఆలయ ప్రాంగణంలో జరిగిన జాతరలో చావ్మీన్, ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తినేసింది.

 ఆ తర్వాత ఇంటికి వస్తుండగా తీవ్ర అస్వస్తతకు గురైంది. అప్పటికే పలుమార్లు ఆమెకు వాంతులు అయ్యాయి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే 12 బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు.  అయితే బాలిక తిన్న  చావ్మీన్ ముక్క ఆమె శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

దీనిపై పోలీసులు కేసు నమోదు  చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బాలిక నవరాత్రులు ఉపవాసాలు చేస్తుండగానే ఆమె చాలా నీరంగా మారిందని, కొంత అనారోగ్యంతో బాధపడుతుందని స్థానికుల విచారణలో బైటపడింది. దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అసలైన విషయాలు వెలుగులోకి రానున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES